వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో క్లీనర్ మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
మహేశ్వరం: వేగంగా వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టిన ఘటనలో క్లీనర్ మృతిచెందగా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పెద్ద అంబర్‌పేట్ నుంచి వస్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉన్న మరో లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ నజీర్(19) అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఖమ్మం జిల్లా కామపల్లి మండలం లింగాల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.