భార్యను వేధిస్తున్న ఎన్‌ఆర్‌ఐ భర్తను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు.
మల్కాజిగిరి: భార్యను వేధిస్తున్న ఎన్‌ఆర్‌ఐ భర్తను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మౌలాలి గాయత్రీనగర్‌కు చెందిన వాణి, సాప్ట్‌వేర్ ఉద్యోగి వినోద్‌కుమార్(45) దంపతులు. విదేశాల్లో పనిచేసే వినోద్‌కుమార్ ఇటీవల హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చాడు.
భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొనడంతో వాణిని విడాకుల కోసం ఒత్తిడి చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు వినోద్‌కుమార్‌ను అరెస్టు చేశారు.