
ప్యార్‌మే పడిపోయానే...
హైదరాబాద్‌తో నాకు నాలుగేళ్ల అనుబంధం ఉంది. నా మాతృభాష తమిళం. ...
అవునండీ... నిజమే రెజీనా ప్రేమలో పడింది.
ఆ ప్రేమ భాగ్యనగరంపైన..
చార్మినార్ పైన.. అక్కడ దొరికే ముత్యాలపైన..
హైదరాబాద్‌తో నాకు నాలుగేళ్ల అనుబంధం ఉంది. నా మాతృభాష తమిళం. టాలీవుడ్‌లో ఛాన్స్ వచ్చినప్పుడు చాలా భయపడ్డాను. అప్పుడు నాకు హైదరాబాద్‌నే ధైర్యం చెప్పింది. ‘కొత్త జంట, రారా కృష్ణయ్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’.. తదితర నా సినిమాల షూటింగ్ ఎక్కువ శాతం సిటీలోనే జరిగింది. దీంతో భాగ్యనగరితో నా అనుబంధం పెరిగింది.
ఇప్పుడు నా సెకండ్ ప్లేస్ హైదరాబాద్. ఇక్కడ ఎంతో కంఫర్ట్‌గా ఉంటుంది. ఇక్కడి ప్రజలు, పురాతన కట్టడాలు చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. అందుకే హైదరాబాద్ ప్రేమలో పడిపోయాను. రియల్లీ ఐ లవ్ భాగ్యనగరి. చార్మినార్ ముత్యాల గాజులంటే నాకు చాలా ఇష్టం. బంజారాహిల్స్‌లోని మహారాజ చాట్‌లో పానీపూరి తినడమంటే మరీ ఇష్టం. - రెజీనా (సినీ నటి)