నాట్‌ ఇన్‌ మై నేమ్‌ | Not in my name | Sakshi
Sakshi News home page

నాట్‌ ఇన్‌ మై నేమ్‌

Jun 29 2017 12:13 AM | Updated on Sep 5 2017 2:42 PM

నాట్‌ ఇన్‌ మై నేమ్‌

నాట్‌ ఇన్‌ మై నేమ్‌

ఎప్పుడూ సందడిగా ఉండే ట్యాంక్‌బండ్‌ బుధవారం సాయంత్రం నాలుగ్గంటల సమయంలో నిశ్శబ్దం ఆవహించింది.

సమానత్వం కోరుతూ శాంతికాముకుల వినూత్న నిరసన 
 
సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడూ సందడిగా ఉండే ట్యాంక్‌బండ్‌ బుధవారం సాయంత్రం నాలుగ్గంటల సమయంలో నిశ్శబ్దం ఆవహించింది. అది న్యాయాన్ని డిమాండ్‌ చేస్తోన్న నిశ్శబ్దం. నిరసనతో కూడిన నిశ్శబ్దం. అన్యాయాన్ని మౌనంగా ధిక్కరిస్తోన్న నిశ్శబ్దం. ఆహారం పేరుతోనో, ఆవు పేరుతోనో, ఇంకో పేరుతోనో, మరేదైనా పేరుతోనో మైనారిటీలపై జరుగుతోన్న దాడులపై నోరు విప్పాలంటూ నిశ్శబ్దంతో నిరసనని పాటించారు దేశంలో శాంతిని కాంక్షిస్తున్న వారు. మానవ హక్కులు కాలరాయొద్దంటున్న వారు. మానవతావాదులు. అంతా ఒక్కరొక్కరుగా ట్యాంక్‌బండ్‌పైకి చేరారు నిశ్శబ్దంగా.

ప్రజలంటే ఒక మతమో, ఒక అంకెనో, ఒక ఓటో మాత్రమే కాదు అని అభిప్రాయపడుతున్న వారు. జనం అంటే ధనవంతులు మాత్రమే కాదంటున్నవారు. జనం అంటే ఒక్క పురుషులు మాత్రమే  కాదంటున్నవారు. జనం అంటే మనం అంటున్నవారు. సమానత్వానికీ దేశంలో స్థానం కల్పించాలంటున్న వారు. స్త్రీలూ, పురుషులూ, థర్డ్‌ జెండర్స్, ట్రాన్స్‌ జెండర్స్, పిల్లలూ, పెద్దలూ అంతా అక్కడ చేరారు. అయితే అక్కడంతా నిశ్శబ్దమే. సంస్థల పేర్లు లేవు, రాజకీయ పార్టీల జాడల్లేవు, విద్యాసంస్థల, సంఘాల బ్యానర్లు లేవు. ఊకదంపుడు ఉపన్యాసాలసలేలేవు. ఉన్నదంతా వ్యక్తులే. వారి చేతుల్లో మాత్రం ‘‘నాట్‌ ఇన్‌ మై నేమ్‌’’ ప్లకార్డులు. దేశవ్యాప్తంగా మైనారిటీలపై జరుగుతోన్న అత్యాచారాలకు, హింసకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ముంబై, బెంగళూరు, ఢిల్లీలోని జంతర్‌మంతర్, హైదరాబాద్‌లాంటి ప్రధాన నగరాల్లో సమానత్వాన్ని కాంక్షిస్తోన్న పౌరులంతా సాయంత్రం నాలుగ్గంటల నుంచి ఆరుగంటల వరకు మౌనంగా నిరసనని తెలియజేశారు.

‘‘నాట్‌ ఇన్‌ మై నేమ్‌’’ అనే స్లోగన్‌కి అర్థం ఈ రోజు నేను దాడికి గురికాకపోవచ్చు. కానీ ఏదో ఒక రోజు నేను కూడా ఒకానొక కారణంతో దాడికి గురికావచ్చు. ఇప్పుడు నేను వ్యతిరేకించకపోతే రేపు నా వంతూ రావచ్చు. అందుకే ఈ దాడులు ఆపాలంటూ మా నిశ్శబ్ద నిరసన ఇది అన్నారు కార్యక్రమంలో ప్రొఫెసర్‌ రమామేల్కొటే, వసంతా కన్నాభిరాన్, కల్పనా కన్నాభిరాన్, సుధ, సునీతా రెడ్డి, ఆశాలత, పద్మజాషా, వసుధ, సుమతి, అనితా రెడ్డి, అజీజ్‌పాషా, తేజస్వీని, కృశాంక్, డేవిడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement