నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడే.. | my life turn in hyderabad, says neha dhupia | Sakshi
Sakshi News home page

నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడే..

Mar 31 2016 8:42 AM | Updated on Apr 3 2019 6:23 PM

నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడే.. - Sakshi

నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడే..

‘హైదరాబాద్ నాకెంతో స్పెషల్. గ్లామర్ వరల్డ్‌లో నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడి నుంచే’ అంటూ బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా ‘ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్’ టైటిల్ గెలిచిన రోజుల్ని గుర్తు చేసుకుంది.

సాక్షి, సిటీబ్యూరో: ‘హైదరాబాద్ నాకెంతో స్పెషల్. గ్లామర్ వరల్డ్‌లో నా లైఫ్ మలుపు తిరిగింది ఇక్కడి నుంచే’ అంటూ బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా ‘ఫెమినా మిస్ ఇండియా యూనివర్స్’ టైటిల్ గెలిచిన రోజుల్ని గుర్తు చేసుకుంది. ఏరియల్ వాషింగ్ పౌడర్ సంస్థ ఆధ్వర్యంలో ‘లాండ్రీ బాధ్యత మహిళలకే ఎందుకు?’ అంశంపై బుధవారం తాజ్ డెక్కన్‌లో చర్చా వేదిక నిర్వహించారు.

తండ్రి ప్రదీప్ ధూపియాతో కలిసి పాల్గొన్న నేహా.. తనను మగపిల్లలతో సమానంగా తల్లిదండ్రులు పెంచారని వివరించింది. తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం హిందీలో రెండు చిత్రాలు చేస్తున్నానంది. తెలుగులో రెండు సినిమాలు చేశానని, మళ్లీ మంచి అవకాశం వస్తే తప్పక చేస్తానంది. ఫిట్‌నెస్ కోసం రోజుకు కనీసం 40 నిమిషాలైనా కేటాయించడం అవసరం అని సూచించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement