సీసీఎస్‌ను సందర్శించిన ఎంపీ కవిత | MP Kavita visits Central crime station in Nampally | Sakshi
Sakshi News home page

సీసీఎస్‌ను సందర్శించిన ఎంపీ కవిత

Apr 16 2016 4:49 PM | Updated on Aug 9 2018 4:51 PM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నగర పోలీసులు సాధిస్తున్న సత్ఫలితాలపై ఎంపీ కవిత సంతృప్తి వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నగర పోలీసులు సాధిస్తున్న సత్ఫలితాలపై ఎంపీ కవిత సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆమె నాంపల్లిలోని సెంట్రల్ క్రైం స్టేషన్(సీసీఎస్)ను సందర్శించారు. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న వివిధ రకాలైన నేరాల అదుపునకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న తీరును ఆమెకు డీజీపీ అనురాగ్ శర్మ వివరించారు. స్టేషన్‌లోని వివిధ విభాగాల పనితీరును ఆమెకు స్వయంగా చూపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ కవిత పోలీసు అధికారుల నుద్దేశించి మాట్లాడారు. పోలీసు శాఖ సాధిస్తున్న విజయాలను, తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement