'కొడుకుల కోసమే ఆస్ట్రేలియా వెళ్లారు' | MLC Prabhakar Allegations on Telangana Assembly Secretary | Sakshi
Sakshi News home page

'కొడుకుల కోసమే ఆస్ట్రేలియా వెళ్లారు'

Aug 27 2015 3:37 PM | Updated on Aug 11 2018 6:42 PM

'కొడుకుల కోసమే ఆస్ట్రేలియా వెళ్లారు' - Sakshi

'కొడుకుల కోసమే ఆస్ట్రేలియా వెళ్లారు'

తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి రూ.10 లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆరోపించారు.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి రూ.10 లక్షల ప్రజాధనం దుర్వినియోగం చేశారని  కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రభాకర్ ఆరోపించారు. ఆస్ట్రేలియాలో ఉన్న ఇద్దరు కుమారులను కలిసేందుకే సదారాం అక్కడికి వెళ్లారని అన్నారు. కామన్వెల్త్, పార్లమెంటరీ అసోసియేషన్ సమావేశాలను అసెంబ్లీ కార్యదర్శి వెళ్లడమేంటని ఆయన ప్రశ్నించారు.

శాసన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ ను తప్పుదోవ పట్టించి ఆస్ట్రేలియాకు తీసుకెళ్లారని ఆరోపించారు. ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం లేకపోయినా తామే వస్తామంటూ లేఖ రాశారని వెల్లడించారు. అసెంబ్లీ కార్యదర్శిగా మరో దఫా ఆయనను కొనసాగించగడం సరికాదన్నారు.  సమర్థులైన అసెంబ్లీ అధికారులు చాలా మంది ఉన్నారని, కావాలంటే సదారాంను ఓఎస్డీగా పెట్టుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement