అందరి భాగస్వామ్యంతోనే ఉపాధి హామీ

అందరి భాగస్వామ్యంతోనే ఉపాధి హామీ - Sakshi

- ఉపాధి హామీ కౌన్సిల్‌ సమావేశంలో మంత్రి జూపల్లి 

ఉపాధి పనుల్లో దేశంలోనే తెలంగాణకు రెండో స్థానం

 

సాక్షి, హైదరాబాద్‌: అందరి భాగస్వామ్యంతో ఉపాధిహామీని ముందుకు తీసుకుపోవాలని రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్‌ చైర్మన్, మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. జూపల్లి అధ్యక్షతన శనివారం రాజేంద్రనగర్‌లోని సిపార్డ్‌లో రాష్ట్ర ఉపాధిహామీ కౌన్సిల్‌ రెండో సమావేశం జరిగిం ది. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు,  నాయి ని నర్సింహారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, చందూలాల్‌ పాల్గొన్నారు. ఉపాధిహామీ పనుల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని జూపల్లి తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదిలో రూ.3 వేల కోట్ల విలువైన పనులను చేపట్టేలా టార్గెట్‌ పెట్టుకున్నామని, జాబ్‌ కార్డులున్న 60% మంది కూలీ లకు 100 రోజుల పని కల్పించే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు.



మిషన్‌ కాకతీయ చెరువుల పూడికతీతను చేపడుతున్నామని, పాఠశాలల్లో మరుగుదొడ్డు, కిచెన్‌ షెడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని అన్నారు. రూ.13 లక్షలతో పంచాయ తీ భవనాలు, రూ.10 లక్షలతో శ్మశాన వాటికలు నిర్మిస్తున్నామని చెప్పారు. 2018 అక్టోబర్‌ 2 నాటి కి స్వచ్ఛ తెలంగాణగా మార్చేందుకు ఇంకుడు గుంతలు, పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 2.63 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 34,088 మరుగుదొడ్లను నిర్మించామని తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి స్త్రీ నిధి బ్యాంకు ద్వారా రూ.200 కోట్లను మహిళా సంఘాలకు అడ్వాన్స్‌ రూపంలో అందజేస్తున్నామని వివరించారు. 1,000 మంది జనాభాకు ఇద్దరు ఉపాధి కూలీలను ఏడాది పొడవునా పారిశుధ్య కార్మికులుగా వినియోగించుకునేందుకు అవకాశమివ్వాలని ఇటీవల భోపాల్‌లో కేంద్ర మంత్రి తోమర్‌ను కోరామన్నారు.

 

ఉపాధి హామీ సిబ్బందికి హరీశ్‌ ప్రశంసలు..

ఇటీవల జాతీయస్థాయిలో 5 అవార్డులు దక్కిం చుకున్న ఉపాధి హామీ సిబ్బందిని, అధికారులను  హరీశ్‌రావు అభినందించారు. వాటర్‌ స్టోరేజీ పాండ్‌కు ప్లాస్టిక్‌ కవర్‌ బదులుగా బ్రిక్స్‌తో నిర్మించుకునే అవకాశమివ్వాలని కోరారు. మొక్కలకు నీరు పోసే ట్యాంకర్‌కు రూ.482 ఇస్తున్నారని, దీనిని పెంచాలని కోరారు. శ్మశానవాటికల కోసం సిద్దిపేటలో ఒక డిజైన్‌ను రూపొందించామని, దీనిని ఇతర ప్రాంతాల్లోనూ టైప్‌–2గా నిర్మించుకునే వెసులుబాటు ఇవ్వాలన్నారు. రోడ్డు పక్కన కూరగాయలు అమ్మే వారికోసం షెడ్డులను నిర్మించాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని, టీఏ ఇవ్వాలని సభ్యులు కోరగా జూపల్లి సానుకూలంగా స్పందించారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ స్పెషల్‌ సీఎస్‌ మిశ్రా, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాశ్‌రాజ్, కమిషనర్‌ నీతూప్రసాద్, కౌన్సిల్‌ సభ్యులైన కరీంనగర్, వరంగల్‌ జెడ్పీ చైర్మన్లు తుల ఉమ పాల్గొన్నారు. 
Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top