కేంద్ర ప్రభుత్వం వాటా నిధులను విడుదల చేయాలని కేంద్రాన్ని జోగు రామన్న కోరారు.
కేంద్ర మంత్రి గెహ్లాట్‌కు మంత్రి జోగు రామన్న విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో బీసీ హాస్టళ్ల ఏర్పాటు, బీసీ విద్యా ర్థులకు స్కాలర్‌షిప్ లు మంజూరు చేయ డానికి కేంద్ర ప్రభు త్వం వాటా నిధులను విడుదల చేయాలని కేంద్ర సామాజిక న్యాయ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్‌ను మంత్రి జోగు రామన్న కోరారు.
కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన.. రాష్ట్రంలో బీసీ ల సంక్షేమానికి చేపడుతున్న వివిధ పథకా లను వివరించారు. వీటిని పరిశీలించడానికి రాష్ట్రంలో పర్యటించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి... బడ్జెట్ సమావేశాల అనంతరం పర్యటిస్తానని హామీ ఇచ్చారు.