వర్షాలు లేక నిత్యావసరాల ధరలు పెరిగిన మాట వాస్తవమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల అన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ఆయన గురువారం 'సాక్షి'తో మాట్లాడారు.
	హైదరాబాద్ : వర్షాలు లేక నిత్యావసరాల ధరలు పెరిగిన మాట వాస్తవమని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల అన్నారు. నిత్యావసరాల ధరల పెరుగుదలపై ఆయన గురువారం 'సాక్షి'తో మాట్లాడారు. కొన్నిచోట్ల పప్పుల బ్లాక్ మార్కెట్ జరుగుతోందని, బ్లాక్ మార్కెట్ అయిన పప్పులను వెనక్కి తెస్తున్నామని తెలిపారు. త్వరలోనే కందిపప్పు ధరను రూ.110 నుంచి రూ.120 వరకు అందుబాటులో ఉంచుతామన్నారు.
	
	కొన్ని నిత్యావసర ధరల నియంత్రణ ప్రభుత్వ అదుపులో ఉండటం లేదని, అయినప్పటికీ ప్రభుత్వమే కొన్ని వస్తువులను సబ్సిడీపై సరఫరా చేస్తోందని తెలిపారు. ఇతర శాఖల సమన్వయంతో ధరలను నియంత్రిస్తామని అన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
