అర్హతల్లేనివారు పనిచేస్తున్నారు: ఆర్కే | Minimum qualificationers work in State Assembly | Sakshi
Sakshi News home page

అర్హతల్లేనివారు పనిచేస్తున్నారు: ఆర్కే

Aug 10 2016 3:26 AM | Updated on Sep 4 2017 8:34 AM

కనీస విద్యార్హతలు లేని వ్యక్తులు రాష్ట్ర శాసనసభలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆరోపించారు.

సాక్షి, హైదరాబాద్: కనీస విద్యార్హతలు లేని వ్యక్తులు రాష్ట్ర శాసనసభలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆరోపించారు. అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగుల విద్యార్హతల సమాచారం కోరుతూ ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను సచివాలయంలో కలసి లేఖ సమర్పించారు. అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగుల విద్యార్హతలపై సమాచారాన్ని అందించాలని ఆర్‌టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా పది నెలల క్రితం కోరినా ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌తోపాటు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement