పేపర్ల లీకేజి వెనుక మశ్చేందర్? | maschendar's hand suspected in leakage of rrb papers | Sakshi
Sakshi News home page

పేపర్ల లీకేజి వెనుక మశ్చేందర్?

Dec 1 2014 4:58 PM | Updated on Sep 2 2017 5:28 PM

ఆర్ఆర్బీ గ్రూప్-డి పరీక్ష పత్రాల లీకేజి వ్యవహారం వెనక మశ్చేందర్ అనే రైల్వే ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తెలుస్తోందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు.

ఆర్ఆర్బీ గ్రూప్-డి పరీక్ష పత్రాల లీకేజి వ్యవహారం వెనక మశ్చేందర్ అనే రైల్వే ఉద్యోగి పాత్ర ఉన్నట్లు తెలుస్తోందని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సాంబశివరావు తెలిపారు. లీకేజి ఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. రైల్వే సిబ్బంది పాత్ర ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిగిలిన సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా సాగాయని ఆయన అన్నారు.

కాపీయింగ్ చేస్తున్నారన్న ఆరోపణలపై పదిమందిని పోలీసులు విచారిస్తున్నారని సాంబశివరావు అన్నారు. పరీక్ష రద్దు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తదని ఆయన చెప్పారు. పోలీసులు అందించిన వివరాలను రైల్వే బోర్డుకు నివేదిస్తామని, రైల్వే బోర్డు ఆదేశాల మేరకు నడుకుంటామని అన్నారు. మొత్తం 3.19 లక్షల మంది ఈ పరీక్షలు రాసినట్లు సాంబశివరావు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement