తుపాకీ రాముణ్ణి మరిపిస్తున్న కేటీఆర్ | mallu bhatti vikramarka fire on ktr | Sakshi
Sakshi News home page

తుపాకీ రాముణ్ణి మరిపిస్తున్న కేటీఆర్

Jan 26 2016 3:05 AM | Updated on Mar 18 2019 9:02 PM

తుపాకీ రాముణ్ణి మరిపిస్తున్న కేటీఆర్ - Sakshi

తుపాకీ రాముణ్ణి మరిపిస్తున్న కేటీఆర్

‘తుపాకి రాముడు పది పిట్టలను కొట్టె ను.. నాలుగు సింహాలను వేటాడెను’ అని .....

మల్లు భట్టి విక్రమార్క
 
ముషీరాబాద్: ‘తుపాకి రాముడు పది పిట్టలను కొట్టె ను.. నాలుగు సింహాలను వేటాడెను’ అని చెప్పుకున్నట్టు మంత్రి కేటీఆర్ చేయని పనులను చెబుతూ తుపాకీ రాముణ్ణి మరిపిస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ, అడిక్‌మెట్ డివి జన్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అడిక్‌మెట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎం.సావిత్రిని గెలిపించాలని ఇం టింటికీ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్‌ను విశ్వనగరంగా తయారు చేస్తే... నగరాన్ని విధ్వంసం చేసే కార్యక్రమం టీఆర్‌ఎస్ ప్రభత్వం చేపట్టిందన్నారు. కాం గ్రెస్ పార్టీ మెట్రో రైలును ప్రారంభిస్తే... అక్కడికి వెళ్లి కేటీఆర్ ఫొటో లు దిగుతున్నారని... గోదావరి జలాలు నగరానికి తీసుకువస్తే, ఆ జలాలను నెత్తిన చల్లుకుంటూ తామే తీసుకొచ్చినట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగరానికి బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ కాం గ్రెస్ ఇన్‌చార్జి డాక్టర్ వినయ్, పరిశీలకులు ఆకుల లలిత, రమాదేవి, ఇందిర, కీర్తి, జగన్‌మోహనరావు తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement