ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువతి అనుమానస్పద స్థితిలో ల్యాబ్‌లోనే మృతి చెందింది.
హైదరాబాద్: ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువతి అనుమానస్పద స్థితిలో ల్యాబ్‌లోనే మృతి చెందింది. ఈ ఘటన బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. వరంగల్ జిల్లా మరిపెడ ఉగ్గంపల్లికి చెందిన ముత్యం సత్యనారాయణ కుమార్తె సమత(24) కూకట్‌పల్లి వివేక్‌నగర్‌లోని శ్రీసాయిరాం లేడీస్ హాస్టల్‌లో ఉంటూ బోయిన్‌పల్లి చిన్నతోకట్ట గోల్ఫి ల్యాబోరేటరీలో ఏడాదిగా పనిచేస్తోంది.
కాగా, ల్యాబ్ నిర్వాహకుడు శ్రీనివాస్...సమతను పెళ్లి చేసుకుంటానంటూ వేధిస్తున్నట్లు సమాచారం. వివాహితుడైన శ్రీనివాస్ ప్రతిపాదనను ఆమె వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం రాత్రి ల్యాబ్‌లోనే ఫ్యాన్‌ను ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. కాగా, పోలీసులు ఈ ఘటన జరిగిన సమయంలో ల్యాబ్‌లోనే ఉన్న శ్రీనివాస్‌తో పాటు ఇతరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.