డైరెక్టర్ విశ్వనాథ్ కు సాక్షి ఎక్సలెన్స్ అవార్డు | Kasinathuni Viswanath got sakshi life time achievement award | Sakshi
Sakshi News home page

డైరెక్టర్ విశ్వనాథ్ కు లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు

Apr 24 2016 9:57 PM | Updated on Aug 20 2018 8:20 PM

ప్రముఖ సినీదర్శకుడు కె.విశ్వనాథ్ గారికి సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు.

హైదరాబాద్: ప్రముఖ సినీదర్శకుడు కె.విశ్వనాథ్ గారికి సాక్షి ఎక్సలెన్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం చేశారు. సాక్షి చైర్ పర్సన్ వైఎస్ భారతి, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేతుల మీదుగా కళాతపస్వి విశ్వనాథ్ అవార్డు అందుకున్నారు. సినీరంగంలో చేసిన అత్యుత్తమ సేవలను గుర్తించిన సాక్షి సంస్థ 2015 సంవత్సరానికిగానూ ఈ అవార్డును నేడు ఆయనకు ప్రధానంచేశారు.

సాక్షి ఎక్సలెన్స్ అవార్డులో ఈరోజు మొట్టమొదటి అవార్డు అందుకున్న అమర జవాను ముస్తాక్ అహ్మద్ భార్య, ఓ చేతిలో బిడ్డతో వచ్చి అవార్డు తీసుకోవడం కన్నా తనకు మంచి సీన్స్ ఎక్కడ దొరుకుతాయని కె.విశ్వనాథ్ గారు అభిప్రాయపడ్డారు. వృత్తిగా చేయవలసిన బాధ్యతతో మూవీలు చేశామని పేర్కొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి ఎంతో మంది తెలివైనవాళ్లున్నారని, వారికి తాను మెరుగులు దిద్దలేదని సొంతంగా వారే ఎదిగారని అన్నారు. ఇండస్ట్రీకి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ తనను గుర్తుపెట్టుకుని మరీ గౌరవించిన సాక్షి సంస్థకు ధన్యావాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement