మోసగాళ్లకు టీఆర్ఎస్లో స్థానం లేదు: కర్నె | karne prabhakar fired on Edunuri Santosh | Sakshi
Sakshi News home page

మోసగాళ్లకు టీఆర్ఎస్లో స్థానం లేదు: కర్నె

Nov 22 2016 3:24 AM | Updated on Sep 4 2017 8:43 PM

మోసగాళ్లకు టీఆర్ఎస్లో స్థానం లేదు: కర్నె

మోసగాళ్లకు టీఆర్ఎస్లో స్థానం లేదు: కర్నె

ఉద్యోగాలిప్పిస్తానని యువత నుంచి డబ్బులు వసూలు చేస్త్తు న్న ఎదునూరి సంతోష్‌తో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం ...

సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలిప్పిస్తానని యువత నుంచి డబ్బులు వసూలు చేస్త్తు న్న ఎదునూరి సంతోష్‌తో టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని, కొన్ని చానళ్లలో పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. మోసగాళ్లకు పార్టీలో స్థానం ఉండదని, నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తితో మంత్రి జగదీశ్‌రెడ్డికి సంబంధం ఉందని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తు న్నామన్నారు. సోమవారం అసెంబ్లీ మీడి యా పారుుంట్‌లో ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం తిమ్మాపూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తగా సంతోష్ పనిచేశాడని, రెండేళ్ల కిందట జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాం గ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడని, ప్రస్తుతం ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకునిగా ప్రచారం చేసుకుంటున్నాడన్నారు.  టీఆర్ ఎస్‌వీ నాయకులే అతన్ని అరెస్ట్ చేయా లని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement