కాచిగూడ స్టేషన్ లో అంతా కార్డుమయం! | Kacheguda rly station goes digital | Sakshi
Sakshi News home page

కాచిగూడ స్టేషన్ లో అంతా కార్డుమయం!

Feb 20 2017 3:09 AM | Updated on Sep 5 2017 4:07 AM

కాచిగూడ స్టేషన్ లో అంతా కార్డుమయం!

కాచిగూడ స్టేషన్ లో అంతా కార్డుమయం!

వినోద్‌ కుమార్‌ యాదవ్‌, కాచిగూడ రైల్వేస్టేషన్,డిజిటల్‌ రైల్వే స్టేషన్,నూతన జీఎం

► దేశంలోనే తొలి ‘డిజిటల్‌’ రైల్వే స్టేషన్ గా గుర్తింపు
► నేడు ప్రారంభించనున్న రైల్వే జీఎం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోనే ప్రథమంగా పూర్తిస్థాయి డిజిటల్‌ స్టేషన్ గా కాచిగూడ రైల్వేస్టేషన్  అరుదైన ఘనతను సొంతం చేసుకుంటోంది. కౌంటర్‌లో టికెట్‌ కొనాలన్నా.. దుకాణాల్లో వస్తువులు కావాలన్నా.. పార్కింగ్‌ యార్డులో బిల్లు చెల్లించాలన్నా.. క్లాక్‌రూంలో సామాను భద్రపరచాలన్నా.. చెల్లింపులన్నీ కార్డుతోనే. ఎక్కడా డబ్బు చెల్లించాల్సిన పనిలేదు. ఈమేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు పక్కా ఏర్పాట్లు చేశారు. దీన్ని దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌ సోమవారం ప్రారంభించనున్నారు.

నూతన జీఎంగా బాధ్యతలు స్వీకరించిన వినోద్‌ కుమార్‌యాదవ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాచిగూడను వంద శాతం డిజిటల్‌ స్టేషన్ గా మార్చాలని నిర్ణయించి నెల రోజుల పాటు కసరత్తు చేశారు. సేషన్ లోని అన్ని దుకాణాల యజమానులు, పార్కింగ్‌ కాంట్రాక్టర్, క్లాక్‌రూం నిర్వాహకులతో చర్చించి అందరూ స్వైపింగ్‌ మెషీన్లు సమకూర్చుకునేలా చూశారు. ఇప్పుడు అన్ని దుకాణాల్లో మెషీన్లు సమకూరాయి. ఇప్పటి వరకు దేశంలో మరే స్టేషన్ శాతం కార్డుతో చెల్లింపు వసతి లేదని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. టికెట్‌ కౌంటర్లకే పీఓఎస్‌లు పరిమితమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement