ప్రకృతిని కాపాడితేనే మానవ మనుగడ | if save nature of human survival | Sakshi
Sakshi News home page

ప్రకృతిని కాపాడితేనే మానవ మనుగడ

Aug 8 2016 11:35 PM | Updated on Oct 20 2018 4:36 PM

కాలుష్యమయంగా మారుతున్న భూగోళంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని సాక్షి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ దిలీప్‌రెడ్డి అన్నారు.

ఇబ్రహీంపట్నం : కాలుష్యమయంగా మారుతున్న భూగోళంలో ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందని సాక్షి ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్‌ దిలీప్‌రెడ్డి అన్నారు. ‘బడిలో చెట్టు భవితకు మెట్టు’ అనే కార్యక్రమంలో భాగంగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని మొక్కల సంరక్షణకు ట్రీగార్డ్స్‌ ను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లక్షలాది చెట్లను మన అవసరాలకు నరికివేస్తున్నమే తప్ప తిరిగి మొక్కలు పెంచే బాధ్యతను తీసుకోవడం లేదన్నారు.

మొక్కలను నాటి వాటిని సంరక్షించని పక్షంలో భవిష్యత్‌ను ఊహించుకోలేమని తెలిపారు. ఇందుకోసం పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. వాతావరణంలోని ఓజోన్‌ పొర దెబ్బతిని కాన్సర్‌ లాంటి భయంకర వ్యాధులు అధికమైతున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ట్రాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి ఏడాదికి 46 కోట్ల చొప్పున ఐదేళ్లలో 250 కోట్ల మొక్కలను నాటాలన్న లక్షా్యన్ని పెట్టుకోవడం శుభ పరిణామన్నారు. అనంతరం మొక్కల పెంపకంపై విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సదా వెంకట్‌రెడ్డి, మండల విధ్యాధికారుల వెంకట్‌రెడ్డి, రఘుకుమార్, గురుకుల విద్యాపీఠ్‌ ప్రిన్సిపాల్‌ డీ శ్రీనివాస్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విశ్వనాథ్‌గుప్త, శ్రీనివాస్‌గౌడ్, సీఐ స్వామి, ఫౌండేషన్‌ సభ్యులు వెంకటేష్, పాండు రంగారెడ్డి, చిత్రాలేఖలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిలీప్‌రెడ్డి మొక్కలను నాటి, ట్రీగార?ట్స్‌ ను పెట్టారు. ఈ ఫౌండేషన్‌కు విరాళం ఇచ్చిన జంబుల వెంకట్‌రెడ్డి కుటుంబాన్ని సన్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement