ఎమ్మెల్యే ఇల్లు కూల్చేయాల్సిందే: హైకోర్టు | high court orders to demolish mla's building | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే ఇల్లు కూల్చేయాల్సిందే: హైకోర్టు

Jun 27 2016 12:53 PM | Updated on Aug 31 2018 8:31 PM

ఎమ్మెల్యే ఇల్లు కూల్చేయాల్సిందే: హైకోర్టు - Sakshi

ఎమ్మెల్యే ఇల్లు కూల్చేయాల్సిందే: హైకోర్టు

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు చెందిన భవనాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకు చెందిన భవనాన్ని కూల్చేయాలని హైకోర్టు ఆదేశించింది. తగినంత సెట్బ్యాక్లతో జి+1 నిర్మాణానికి మాత్రమే అనుమతి తీసుకుని.. 4 అంతస్తులు కట్టడంతో దాన్ని కూల్చేయాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. భవనాల్లో ఉన్నవాళ్లు మూడు నెలల్లో ఖాళీ చేయాలని, 6 నెలల్లోగా కూల్చివేత ప్రక్రియ మొత్తం పూర్తికావాలని హైకోర్టు ఆదేశించింది.

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్‌ గ్రామంలోని సర్వే నంబర్లు 79 నుంచి 82 వరకు గల స్థలంలో జీహెచ్‌ఎంసీ నుంచి తీసుకున్న అనుమతి ప్లాన్ను ఉల్లంఘిస్తూ భారీ వాణిజ్య సముదాయాలను నిర్మించారని, దీనిపై ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నారంటూ వివేక్‌ సమీప బంధువు కె.ఎం.ప్రతాప్‌ గతేడాది ఏప్రిల్‌లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి.. వాటిని అక్రమ కట్టడాలుగా పేర్కొంటూ  కూల్చేయాలని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌చేస్తూ వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆ భవనంలో ఉన్న నారాయణ కాలేజీ యాజమాన్యం ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. చివరకు ధర్మాసనం కూడా సింగిల్ జడ్జి తీర్పునే సమర్థిస్తూ.. భవనాలను కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement