రోడ్డు ప్రమాదంలో హీరో భార్యకు గాయాలు | Hero manchu vishnu wife Viranica injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హీరో భార్యకు గాయాలు

Jun 18 2016 1:36 PM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో హీరో భార్యకు గాయాలు - Sakshi

రోడ్డు ప్రమాదంలో హీరో భార్యకు గాయాలు

ప్రముఖ నటుడు మోహన్ బాబు కోడలు, హీరో మంచు విష్ణు భార్య విరోనికా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.

హైదరాబాద్ : ప్రముఖ నటుడు మోహన్ బాబు కోడలు, హీరో మంచు విష్ణు భార్య విరోనికా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జల్పల్లి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విరోనికాతో పాటు మరొకరికి స్వల్పంగా గాయలయ్యాయి.

వీరు ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి జల్పల్లి ఫాంహౌస్కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. వోల్వో ఎస్‌యూవీలో వెళ్తుండగా స్వల్ప ప్రమాదం జరిగిందని, అది సురక్షితమైన వాహనం కావడంతో కొద్దిపాటి గాయాలతోనే విరోనికా బయటపడ్డారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement