డీ మార్ట్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. నవ వివాహిత మృతి | Newlywed woman dies in road accident near Malakpet D-Mart | Sakshi
Sakshi News home page

డీ మార్ట్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. నవ వివాహిత మృతి

Oct 10 2026 5:46 PM | Updated on Oct 10 2026 6:03 PM

Newlywed woman dies in road accident near Malakpet D-Mart

సాక్షి, హైదరాబాద్: మలక్‌పేట్ డీ-మార్ట్ సిగ్నల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం నవ వివాహితను పొట్టన పెట్టుకుంది. ఆటో డ్రైవర్ నిర్లక్షంతో బైక్ అదుపుతప్పి  బస్సు కిందపడి ఎల్బీనగర్‌కు చెందిన వివాహిత లావణ్య (25) అక్కడికక్కడే మృతిచెందింది.

వివరాల్లోకి వెళితే.. ఎల్‌బీనగర్‌కు చెందిన బి. లావణ్య (25) తన భర్తతో కలిసి ద్విచక్ర వాహనం నంబర్ TS 09 FF 2709పై ఎల్‌బీనగర్ నుంచి చాదర్‌ఘాట్ వైపు వెళ్తుంది, డీ-మార్ట్ సిగ్నల్ వద్ద ఆటో డ్రైవర్‌ నిర్లక్షంతో రోడ్డును దాట బోయాడు. దీంతో కంగారుపడిన లావణ్య  అదుపుతప్పి పడిపోయింది.

అయితే అదే సమయంలో దురదృష్టవశాత్తు   బస్సు వచ్చింది. దీంతో బస్సు  వెనుక చక్రాల కింద పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.


ఇదీ చదవండి:టెండర్లలో వేల కోట్ల కుంభకోణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement