ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉంటేనే అడ్మిషన్లు: హైకోర్టు | have facilities within six weeks, high court orders engineering colleges | Sakshi
Sakshi News home page

ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉంటేనే అడ్మిషన్లు: హైకోర్టు

Sep 23 2015 1:48 PM | Updated on Aug 31 2018 8:24 PM

ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉంటేనే అడ్మిషన్లు: హైకోర్టు - Sakshi

ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉంటేనే అడ్మిషన్లు: హైకోర్టు

తెలంగాణలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలలో ఫ్యాకల్టీతో పాటు ఇతర సదుపాయాలను ఆరు వారాల్లోగా సమకూర్చుకోవాలని హైకోర్టు సూచించింది. అలా సమకూర్చుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.

తెలంగాణలో ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల విషయమై హైకోర్టులో విచారణ ముగిసింది. ఫ్యాకల్టీతో పాటు ఇతర సదుపాయాలను ఆరు వారాల్లోగా సమకూర్చుకోవాలని కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టు సూచించింది. అలా సమకూర్చుకున్న తర్వాత మాత్రమే అడ్మిషన్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది.

హైకోర్టు ప్రతినిధితో పాటు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని నియమించి, సదుపాయాలు పరిశీలించాలని స్పష్టం చేసింది. ఆ పరిశీలనలో ప్రమాణాలు లేవని తేలితే అడ్మిషన్లు రద్దు చేయాలని కూడా హైకోర్టు తన ఆదేశాలలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement