దొంగతనం చేసిందనే నెపంతో హింసించారు | girl tortured due to dought of gold robbery | Sakshi
Sakshi News home page

దొంగతనం చేసిందనే నెపంతో హింసించారు

Aug 8 2015 5:50 PM | Updated on Sep 3 2017 7:03 AM

ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ యువతిని దొంగతనం చేసిందనే నెపంతో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు.

హైదరాబాద్(మల్కాజ్‌గిరి): ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ యువతిని దొంగతనం చేసిందనే నెపంతో పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటన నగరంలోని మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మూడు తులాల బంగారం చోరీ జరిగింది. దీంతో యాజమాన్యం సదరు బాలికపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు యువతి(17)పై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెను విచారణ పేరుతో హింసించినట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement