
పొలిటికల్ సెటప్..
ఎన్నికల సీజన్‌లో ప్రచార సామగ్రికి భలే గిరాకీ ఉంటుంది. బయట ఓట్ల కోసం పార్టీలు కుమ్ములాడుకుంటుంటే..
ఎన్నికల సీజన్‌లో ప్రచార సామగ్రికి భలే గిరాకీ ఉంటుంది. బయట ఓట్ల కోసం పార్టీలు కుమ్ములాడుకుంటుంటే.. అన్ని పార్టీల జెండాలు, బ్యానర్లు ఒకేదగ్గర తయారవుతున్నాయి. వీటితోపాటు పార్టీల వారీగా ప్రచార రథాలూ రెడీ అవుతున్నాయి. అయితే, స్థాయినిబట్టి ఆటోలకు, కార్లకు, బస్సులకు సరిపోయే విధంగా తయారీదారులు ‘సెటప్’లను సిద్ధం చేస్తున్నారు. పార్టీ రంగులు అద్ది.. డివిజన్ నంబర్ వద్ద ఖాళీ ఉంచుతున్నారు. ఆర్డర్ రావడమే తరువాయి.. అభ్యర్థి పేరు, డివిజన్ నంబర్ వేసి ఇచ్చేయడమే. నేతలకు చూపించేందుకు వాటి నమూనాలను తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు. అదే ఈ చిత్రం. దోమలగూడ ప్రాంతంలో తయారీదారులు తమ దుకాణం వద్ద ఉంచిన నమూనా ప్రచార రథాలను ఈ చిత్రంలో చూడవచ్చు.
- సాక్షి, సిటీబ్యూరో