ఏసీ, 4జి వై-ఫైతో సిటీలో ఈజీ కమ్యూట్ | easy commute provides sharing cab with ac and 4g wi-fi | Sakshi
Sakshi News home page

ఏసీ, 4జి వై-ఫైతో సిటీలో ఈజీ కమ్యూట్

Feb 26 2016 9:14 AM | Updated on Sep 3 2017 6:29 PM

ఏసీ, 4జి వై-ఫైతో సిటీలో ఈజీ కమ్యూట్

ఏసీ, 4జి వై-ఫైతో సిటీలో ఈజీ కమ్యూట్

సిటీలో తిరిగేందుకు వీలుగా ఏసీ, 4జి వై-ఫై సదుపాయాలతో వచ్చిన షేరింగ్ క్యాబ్ ఈజీ కమ్యూట్

ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉండే హైదరాబాద్‌ లాంటి నగరాల్లో ప్రతిరోజూ ఉద్యోగాల కోసం 20-30 కిలోమీటర్ల దూరం వెళ్లేవాళ్లు చాలామందే ఉంటారు. వీళ్లలో కార్లు, ద్విచక్రవాహనాలు వాడేవాళ్లు 15-20 శాతం మాత్రమే. మిగిలిన వాళ్లంతా అయితే సిటీబస్సులు లేదా ఎంఎంటీఎస్‌ రైళ్లను నమ్ముకునే వెళ్తుంటారు. కానీ మనకు కావాల్సిన సమయానికి బస్సు దొరకడం, ఒకవేళ బస్సు వచ్చినా అందులో సీటు దొరకడం దాదాపు అసాధ్యమే. పోనీ క్యాబ్‌లలో వెళ్దామా అంటే అంత డబ్బు పెట్టుకునే పరిస్థితి ఉండదు. ఇలాంటి సమస్యలను తీర్చేందుకు మొదలైన ఓ స్టార్టప్‌ కంపెనీయే ఈజీకమ్యూట్‌. ఇలాంటి సమస్యతో బాధపడిన ఓ యువకుడు రాహుల్‌ జైన్‌. అతడికి ఈ సమస్యను తానే ఎందుకు పరిష్కరించకూడదన్న ఆలోచన వచ్చింది. వెంటనే తన మిత్రుడు మయాంక్‌ చావ్లాతో పంచుకున్నాడు. ఆ ఆలోచనే ఈజీకమ్యూట్‌గా రూపొందింది.

ఈజీ కమ్యూట్‌ అనేది నగరంలో తిరిగే ఏసీ బస్‌ షటిల్‌ సర్వీస్‌. ఏసీ మినీబస్సులను నడుపుతున్న ఈ సంస్థ.. వాటిలో 4జి వై-ఫై సేవలను కూడా అందిస్తోంది. దీని యాప్‌ద్వారా మనకు కావల్సిన సమయానికి కావల్సిన రూట్లో సీటు బుక్‌ చేసుకోవచ్చు. ప్రతి బోగీకి ఒక అటెండెంట్‌ ఉంటారు, అత్యవసర పరిస్థితిలో తెలియజేసేందుకు యాప్‌లోనే ఎస్‌ఓఎస్‌ సదుపాయం కూడా ఉంది. తాజాగా రామంతపూర్‌ నుంచి గచ్చిబౌలి మీనాక్షి థియేటర్‌ మార్గంలో కేవలం మహిళల కోసం కూడా ఓ సర్వీసు ప్రారంభించారు. ప్రయాణికుల డిమాండుకు అనుగుణంగా ప్రతి వారం కొత్త రూట్లను ప్రవేశపెడుతున్నారు. మొబైల్‌ యాప్‌లో ఉన్న 'సజెస్ట్‌ రూట్‌' ద్వారా మన మార్గంలో ఇప్పటికి క్యాబ్‌ లేకపోయినా దాన్ని సూచించే అవకాశం ఉంది. యాప్‌ కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకున్నవారికి రెండు ఫ్రీ రైడ్లు ఆఫర్‌ చేస్తున్నారు. వాటిద్వారా ముందు ఎలా ఉందో చూసుకుని ఆ తర్వాత రోజువారీ ప్రయాణాలు ప్లాన్‌ చేసుకోవచ్చు.

Advertisement

పోల్

Advertisement