ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నాం: టీడీపీ ఎంపీలు | concern because: TDP MPs | Sakshi
Sakshi News home page

ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నాం: టీడీపీ ఎంపీలు

Published Thu, Aug 4 2016 3:22 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

concern because: TDP MPs

న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై పార్లమెంటులో రెండ్రోజులుగా చేస్తున్న ఆందోళనకు తాత్కాలిక విరామం ఇచ్చినట్లు టీడీపీ ఎంపీలు మురళీమోహన్, రామ్మోహన్ నాయుడు, అవంతి శ్రీనివాస్ బుధవారమిక్కడ తెలిపారు. విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో హామీ ఇచ్చినందున..  అమలుకు కొంత సమయం ఇవ్వాలనే ఆందోళనకు విరామం ప్రకటించామన్నారు.

ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చకు పట్టుపడతామని పేర్కొన్నారు. హోదా అంశంపై ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై సీఎం చంద్రబాబు సూచనలిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే హోదా ఇచ్చే వరకు.. పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టే ఏ బిల్లుకూ మద్దతు ఇవ్వకూడదని సవాల్ విసిరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement