స్మార్ట్ ఫోన్‌లో.. సిటీబస్సు సమాచారమ్ | City bus information in Smart phone .. | Sakshi
Sakshi News home page

స్మార్ట్ ఫోన్‌లో.. సిటీబస్సు సమాచారమ్

Feb 2 2015 4:53 AM | Updated on Sep 19 2018 8:25 PM

స్మార్ట్ ఫోన్‌లో.. సిటీబస్సు సమాచారమ్ - Sakshi

స్మార్ట్ ఫోన్‌లో.. సిటీబస్సు సమాచారమ్

మహానగరంలో సిటీబస్సు ప్రయాణం అంటే కత్తి మీద సాము లాంటిదే. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో చెప్పలేం....

మహానగరంలో సిటీబస్సు ప్రయాణం అంటే కత్తి మీద సాము లాంటిదే. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఏ బస్సు ఎక్కడ ఆగుతుందో చెప్పలేం. అసలు పలానా రూట్‌లో సిటీ బస్సు సౌకర్యం ఉందా? లేదా అన్నదీ చెప్పడం కష్టమే. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు తెలంగాణ స్టేట్ రోడ్డు రవాణ సంస్థ ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది నగర ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మరి ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..? ఎలా వాడు కోవాలి..? తదితర విషయాలు మీకోసం...
 
ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
మొదట https://play.google.com/store/apps/details?id=com.apsrtc&hl=en&rdid=com.apsrtc లింక్‌ను క్లిక్ చేయండి.
ఇక్కడ విండోలో ‘హైదరాబాద్ ఆర్‌టీసీ ఇన్‌ఫో’ అని కనిపిస్తుంది. దానికింద ఉన్న ‘ఇన్‌స్టాల్’ ఆఫ్షన్‌ను క్లిక్ చేయండి.
ఇప్పుడు మిమ్మల్ని ‘సైన్ ఇన్’ అవ్వమని కోరుతుంది.
మీకున్న జీ మెయిల్ అకౌంట్‌తో సైన్ ఇన్ అవ్వండి.
తిరిగి ఇన్‌స్టాల్ ఆఫ్షన్‌ను క్లిక్ చేస్తే మీ మొబైల్‌లో యాప్ ‘డౌన్‌లోడ్’ అవుతుంది.
 
యాప్‌ను ఇలా వాడుకోండి..
మొబైల్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత మొబైల్ స్క్రీన్‌పై ‘హైదరాబాద్ ఆర్టీసీ’ విండో కనిపిస్తుంది.
ఇక్కడ మీకు ‘బస్సు డిటైల్స్’, ‘ఫ్రం-టూ’, ‘లొకేషన్’, ‘రియల్ టైం’, ‘మై అకౌంట్’, ‘ఫీడ్‌బ్యాక్’, ‘క్లోజ్’ ఆఫ్షన్స్ కనిపిస్తాయి.
మొదటి రెండు ఆఫ్షన్లు మనకు ఎక్కువగా ఉపయోగపడతాయి.
 
బస్ వివరాలు ఇలా..

ఇక్కడ స్క్రీన్‌పై కనిపిస్తున్న ‘సెలక్ట్’ ఆఫ్షన్‌లో మనకు కావాల్సిన బస్ నంబరును ఎంచుకోవాలి.
ఇప్పుడు ఫోన్ స్క్రీన్‌పై సంబంధిత బస్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు సర్వీసు ఉంది, ఏయే రూట్లలో వెళ్తుంది, ముఖ్యమైన బస్ స్టాపుల వివరాలు కనిపిస్తాయి.
 
ఫ్రం-టూ..
ఇక్కడ కనిపిస్తున్న ‘ఫ్రం’ ఆఫ్షన్‌లో మీరు ఎక్కడ నుంచి బస్ ఎక్కదలిచారో ఆ ప్రాంతాన్ని ఎంటర్ చేయాలి.
‘టూ’ ఆఫ్షన్‌లో ఎక్కడికి వెళ్లాలో ఆ ప్రాంతం పేరు ఎంటర్ చేయాలి.
ఇప్పుడు మీరు కోరుకున్న రూట్‌లో ఏయే బస్సులు అందుబాటులో ఉన్నాయి, వాటి సర్వీసు నెంబరు, అవి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తాయి తదితర వివరాలు కనిపిస్తాయి.
 
లొకేషన్..
‘లొకేషన్’ ఆఫ్షన్‌లో కనిపిస్తున్న బస్ డిపోను ఎంచుకోవాలి. ఇక ఆ డిపో నుంచి ఏయే బస్ సర్వీసులు ఉన్నాయి, అవి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తున్నాయి తదితర విషయాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.

నోట్: అందుబాటులో ఉన్న సర్వీసులతో పాటుగా వాటి వయా రూట్ వివరాలు, వాటి టికెట్ ధరలు కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్‌నెట్ కనెక్షన్ లేకుండానే దీన్ని  సులువుగా ఉపయోగించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement