'తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగులదే కీలకపాత్ర' | BJP state leader dr.lakshman claims differently abled played key role in telangana movement | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగులదే కీలకపాత్ర'

Dec 10 2016 3:50 PM | Updated on Mar 29 2019 9:11 PM

తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగులే కీలక పాత్ర పోషించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో దివ్యాంగులే కీలక పాత్ర పోషించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. కేసీఆర్ గద్దెనెక్కాక ఒక్కసారి కూడా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనకపోవడం ఆయనకు వారి పట్ల ఉన్న చిన్న చూపుకు నిదర్శనం అని మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో జరిగిన వికలాంగుల దినోత్సవంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జనాభా నిష్పత్తి ప్రకారం వికలాంగులకు మూడు శాతం డబుల్ బెడ్‌ రూం ఇళ్లను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. వికలాంగులకు ప్రత్యేక శాఖ కోసం అసెంబ్లీలో డిమాండ్ చేస్తామని చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement