'ఆయనను కరివేపాకులా తీసేస్తున్నారు' | Bhatti vikramarka slams TRS govt | Sakshi
Sakshi News home page

'ఆయనను కరివేపాకులా తీసేస్తున్నారు'

Jun 7 2016 6:21 PM | Updated on Sep 4 2017 1:55 AM

తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంను ఉపయోగించుకుని ఇప్పుడు కరివేపాకులా తీసేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

హైదరాబాద్‌సిటీ: తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంను ఉపయోగించుకుని ఇప్పుడు కరివేపాకులా తీసేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కోదండ రాంపై టీఆర్‌ఎస్ దాడి ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణపై నిబద్ధత కలిగిన నేత కోదండరాం అనీ, ప్రజాభిప్రాయాన్నే కోదండరాం చెప్పారని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే కోదండరాం ప్రశ్నకు సమాధానం చెప్పాలని అన్నారు. ప్రశ్నించిన ప్రతి వ్యక్తినీ కాంగ్రెస్ ఏజెంట్ అనడం దారుణమన్నారు.

తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ దళారీ అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కాంట్రాక్టులు, కమిషన్‌ల కోసమే ప్రాజెక్టులు రీడిజైన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. రెండేళ్ల రెండు లక్షల కోట్ల రూపాయల దోపిడీకి కేసీఆర్ టెండర్ పెట్టారన్నారు. ప్రజాధనాన్ని దోచుకుంటుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదన్నారు. రూ.475 కోట్లు మంజూరు చేస్తే ఖమ్మంలో రూ.4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని అన్నారు. కొన్ని చోట్ల పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement