
ఏపీ సీఎం చంద్రబాబు తీరే కారణం
ఉమ్మడి హైకోర్టుకు సంబంధించిన ప్రస్తుత సమస్యలకు ఏపీ సీఎం చంద్రబాబు తీరునే తప్పుబట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణఅన్నారు.
హైకోర్టు విభజనపై సీపీఐ నేత నారాయణ వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు సంబంధించిన ప్రస్తుత సమస్యలకు ఏపీ సీఎం చంద్రబాబు తీరునే తప్పుబట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణఅన్నారు. సచివాలయాన్ని మారుస్తున్న విధంగానే తమ కోర్టు తమకు కావాలని చంద్రబాబు ఎం దుకు కోరడం లేదని ప్రశ్నించారు.
న్యాయవ్యవస్థలో సంక్షోభపరిస్థితులు ఏర్పడడానికి ప్రధాని మోదీ, చంద్రబాబుల వైఖరే కారణమని ధ్వజమెత్తారు. బుధవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం కలుగజేసుకుని ప్రస్తుత సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. రాష్ట్ర విభజన సమస్యలపై రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ స్పందించాలన్నారు.