రోడ్డు ప్రమాదంలో అమేజాన్ ఉద్యోగి మృతి
హైదరాబాద్
తిరుమలగిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. రెండు స్కూటర్లు-ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని అమేజాన్ సంస్థ ఉద్యోగి అభిషేక్(26)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.