జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ | All parties meeting at assembley committee hall | Sakshi
Sakshi News home page

జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ

Feb 3 2016 2:08 PM | Updated on Jul 11 2019 7:38 PM

తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్ లో కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ ప్రారంభమైంది. టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు, బీజేపీ పక్షనేత లక్ష్మణ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శివకుమార్ లు ఈ భేటీలో పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగిన తీరు, ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై చర్చించనున్నట్లు సమాచారం.

అఖిలపక్ష నేతల భేటీ అనంతరం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను ఈ నేతలు కలిసే అవకాశాలు ఉన్నాయి. ఎంఐఎం నేతలు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తదితర నేతలపై దాడులకు పాల్పడ్డ విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement