216 మంది బాలకార్మికులు వెలుగులోకి.. | 216 child labour found | Sakshi
Sakshi News home page

216 మంది బాలకార్మికులు వెలుగులోకి..

Jan 27 2015 6:43 PM | Updated on Sep 2 2017 8:21 PM

కార్ట్ అండ్ సర్చ్ లో భాగంగా మంగళవారం షెల్టర్ హోంలో సౌత్ జోన్ డీసీపీ నిర్వహించిన సోదాల్లో 216 మంది బాలకార్మికులను కనుగొన్నారు

హైదరాబాద్: కార్ట్ అండ్ సర్చ్ లో భాగంగా మంగళవారం షెల్టర్ హోంలో సౌత్ జోన్ డీసీపీ నిర్వహించిన సోదాల్లో  216 మంది బాలకార్మికులను కనుగొన్నారు.వీళ్లంతా బీహార్, జార్ఖండ్, కర్ణాటక, బంగ్లాదేశ్ లకు చెందిన వారుగా గుర్తించారు. వీరందరినీ వారివారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చైల్డ్ వెల్పేర్ విభాగం తెలియజేసింది. బాలకార్మికుల చేత వెట్టిచాకిరి చేయిస్తున్న 22 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వీళ్లందరినీ కొంతమంది హైదరాబాద్ కు తీసుకువచ్చి వివిధ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు మొదలైన ప్రదేశాల్లో పనిలో చేర్పిస్తున్నారని ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పిల్లలను ఈ వృత్తిలో దించుతున్నారని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement