కొత్తగా పెళ్లైన జంట ఆత్మహత్య | The newly wed couple commits suicide | Sakshi
Sakshi News home page

కొత్తగా పెళ్లైన జంట ఆత్మహత్య

Feb 9 2016 12:00 PM | Updated on Nov 6 2018 7:56 PM

కొత్తగా పెళ్లైన జంట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.

కొత్తగా పెళ్లైన జంట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వనస్థలిపురం శ్రీనివాసపురం కాలనీలోని రోడ్ నెంబర్ 7లో మంగళవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న నూతను దంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన కందకట్ల రాజు, కవితగా గుర్తించారు. రాజు ఎక్స్‌ప్రెస్ టీవీలో కెమరామెన్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement