పాత ఆలయంలోని విగ్రహాల కింద విలువైన ఆభరణాలు లభిస్తాయని కొందరు దుండగులు ఆలయంలో తవ్వకాలకు పాల్పడ్డారు.
కూడేరు: పాత ఆలయంలోని విగ్రహాల కింద విలువైన ఆభరణాలు లభిస్తాయని కొందరు దుండగులు ఆలయంలో తవ్వకాలకు పాల్పడ్డారు. ఆలయ పూజారిని కట్టేసి వినాయకుని విగ్రహం కింద తవ్వకాలు చేపట్టారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలం అంతరగంగ గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. అర్థరాత్రి సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వస్తుండటంతో.. ఆలయ సమీపంలోని స్థానికులు రావడంతో దుండగులు ఆటోలో పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.