చంచల్‌గూడ జైలులో మంగళవారం ఉదయం ఖైదీల మధ్య కొట్లాట జరిగింది.
హైదరాబాద్: చంచల్‌గూడ జైలులో మంగళవారం ఉదయం ఖైదీల మధ్య కొట్లాట జరిగింది. విదేశీ ఖైదీలను ఉంచే బ్యారక్‌లో గొడవ తలెత్తటంతో అధికారులు వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన నైజీరియా దేశస్థుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది.