టారో : 27 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్‌ 2017 వరకు

టారో : 27 ఆగస్టు నుంచి 2 సెప్టెంబర్‌ 2017 వరకు


మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)

జీవితాన్ని చూసే మీ దృష్టి కోణంలో మార్పుకు ఇదే సరైన సమయం. మిమ్మల్ని ప్రస్తుతం వెంటాడుతున్న భయాలు అలాగే కొనసాగుతాయి. కాస్తంత సమయమిస్తే అన్నీ అవే సర్దుకుపోగలవని గ్రహించండి. అవకాశాలు వాటంతట అవే మీ తలుపు తడతాయి. ప్రేమ విషయంలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసంతో, చిత్తశుద్ధితో ముందుకు వెళితే పరిస్థితులన్నీ మీకు అనుకూలంగా మారతాయి.

కలిసివచ్చే రంగు : ఊదా



వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)

మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న, జీవితాన్ని మలుపు తిప్పే విషయాల్లో జాగ్రత్త వహించండి. గత వారంతో పోల్చితే ఈ వారం అంత సాఫీగా ఏదీ జరగదు. అయితే దీన్ని కూడా మంచికే అనుకొని ముందుకు వెళ్లండి. నాణానికి రెండు వైపులు ఉన్నట్లే జీవితం ఉంటుందన్నది అర్థం చేసుకోండి. ఉద్యోగం, ప్రేమ జీవితానికి మధ్య సమన్వయం ఉండేలా చూసుకుంటే పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి.

కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ



మిథునం (మే 21 – జూన్‌ 20)

మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్లండి. అనవసరమైన విషయాలపై శక్తినంతా కేంద్రీకరించి నిరాశ చెందవద్దు. మీకు అన్నివిధాలా అనుకూలించే పనులనే చేయండి. ప్రేమ విషయంలో ఓ గొప్ప రోజు దగ్గరవుతోంది. పాత మిత్రుడిని మళ్లీ కలుసుకుంటారు. మనసుతో కంటే బుద్ధితో ఆలోచించడం మీకు పనికొస్తుంది. కుటుంబ సంబంధిత విషయాలన్నీ మీ చేతుల్లోనే ఉంటాయి.

కలిసివచ్చే రంగు : దొండపండు



కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)

ధైర్యంగా, నమ్మకంతో ముందడుగు వేయండి. తడబడకుండా, మీ శక్తినంతా కేంద్రీకరించి కష్టపడండి. విజయం మీ వైపే ఉన్నదని మరవకండి. ఈ వారం మీకు కలిసివస్తుంది. మీ కష్టానికి తగిన ఫలం దక్కుతుంది. మీ జీవితభాగస్వామిని కలుసుకుంటారు. ఒక కొత్త విషయం చదవాలని అనుకుంటే, అది వెంటనే చేసేయండి. అది మీకు కొత్త దారులను చూపిస్తుంది. మీ ప్రేమ జీవితం సజావుగా సాగిపోతుంది. అంతా మంచే జరుగుతుంది.

కలిసివచ్చే రంగు : దొండపండు



సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)

ఉత్సాహవంతమైన వారమొకటి మీకోసం ఎదురుచూస్తోంది. ఏది జరిగినా మీ మంచికే జరుగుతుందని నమ్మడం అవసరం. మీ నమ్మకమే మిమ్మల్ని విజయం వైపుకు తీసుకెళ్తుంది. పెళ్లి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం సాఫీగా ఉంటుంది. బిజినెస్‌లో కూడా మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొత్తగా ఏదైనా మొదలుపెట్టాలన్న ఆలోచనలో ఉంటే, వెంటనే ఆ పని చేసేయండి. పనిలో గౌరవం, గుర్తింపు దక్కుతాయి.

కలిసివచ్చే రంగు : ఎరుపు



కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)

మీలా ఉండడమన్నదే మీకు గొప్ప ఆభరణం. ఈ కారణం వల్లే మిమ్మల్ని అందరూ ప్రేమిస్తారు. కొత్త పని ఒకటి మొదలుపెట్టేందుకు జంకుతారు. అయితే విజయం మీదేనని గుర్తుంచుకోండి. మీ నిరంతర శ్రమే మిమ్మల్ని విజయం వైపుకు అడుగులు వేయిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అన్నీ వ్యక్తిగా మీ స్థాయిని పెంచేవే. ఇష్టమైన వ్యక్తిని కలుసుకుంటారు. ఇల్లు లేదా ఉద్యోగం మారే సూచనలు కనిపిస్తున్నాయి.

కలిసివచ్చే రంగు : ఫీరీ ఆరెంజ్‌



తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)

ఒక కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. గతాన్ని మరచిపోయి రానున్నదంతా మంచి కాలమే అని నమ్మడం అవసరం. ఎన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురైనా, చివరకు అదీ ఓ చోట ఆగుతుందని గుర్తించండి. సెప్టెంబర్‌ నెలంతా మీరు ఊహించని స్థాయిలో మార్పులు వస్తాయి. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. విహారయాత్రకు వెళ్లాలన్న ఆలోచన ఏదైనా ఉంటే వెంటనే అందుకు సిద్ధంకండి.

కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ



వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)

మీరు ఎదుర్కొంటున్న కష్టాలే మీలో దాగున్న శక్తినంతా బయటకు తీసుకొస్తాయి. అపజాయలు ఎదురైనా ధైర్యంగా మీ బాధ్యతను నిర్వహిస్తూ ఉండండి. విజయం మీదే. కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి. విరామం లేకుండా పనిచేస్తారు. విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ప్రేమలో ఉన్నట్లైతే మీకు ఓ మంచి జరగబోతోంది. ఉల్లాసంగా ప్రేమ జీవితాన్ని ఆస్వాదించండి. ఇంట్లో మీ పిల్లలు సైతం మీ పేరు నిలబెడతారు.

కలిసివచ్చే రంగు : పసుపు



ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)

కొద్దికాలంగా మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోన్న ప్రతికూల పరిస్థితులకు తెరపడుతుంది. ఇకపై అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో పని చేయండి. విరామం లేకుండా పనిచేస్తూ మీకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. పెద్దల సలహాతో ముందుకు వెళితే ప్రేమ జీవితం మరింత అందంగా ఉంటుంది.

కలిసివచ్చే రంగు : వెండి



మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)

ఈవారం మీకు ఒక పెద్ద పరీక్ష ఎదురు కాబోతోంది. జీవితంలో ఇలాంటివి సర్వ సాధారణం అనుకుంటే మిమ్మల్ని ఏ శక్తీ ఆపలేదు. తల్లిదండ్రుల దగ్గర్నుంచి ఊహించని బహుమతి లభిస్తుంది. పాత అప్పులన్నీ తీరే సూచనలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌లో వైద్యుడిని సంప్రదించే అవసరం వస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది

కలిసివచ్చే రంగు : ఆపిల్‌ గ్రీన్‌



కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)

ఉత్సాహంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మీ శైలి మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళుతుంది. మీ ఆలోచన శైలి వల్లే మీకు పనిలో తిరుగులేని పేరు వస్తుంది. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే పరిస్థితులు అన్నీ చక్కబడతాయి. కొత్త విషయాల పట్ల ఆసక్తి చూపిస్తారు. ఇది మీకు బాగా ఉపయోగపడే అంశం. ఎప్పట్నుంచో కంటున్న కలలు నెరవేరే రోజు దగ్గర పడుతోంది. గతాన్ని ఎక్కువగా తల్చుకోకుండా ఉండడం అవసరం. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండి.

కలిసివచ్చే రంగు : తెలుపు



మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)

ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగల శక్తి మీకు సమకూరుతుంది. జీవితాన్ని మీదైన శైలిలో ఆస్వాదించాలన్న మీ ఆలోచనే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అందరితో కలిసిపోవడాన్ని అలవర్చుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తారు. మీ పనే మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళుతుంది. ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఇబ్బందులు ఎదురైనా ఆత్మ విశ్వాసంతో పని చేయండి. పనిలో ఒక మైలురాయిని చేరుకుంటారు. న్యాయ సంబంధిత వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.

కలిసివచ్చే రంగు : వెండి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top