నటించమంటే జీవించింది! | Jyoti surbhi acts natural for Kubhul hi serial | Sakshi
Sakshi News home page

నటించమంటే జీవించింది!

Published Sun, Jun 8 2014 1:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:27 AM

నటించమంటే జీవించింది!

పని అందరూ చేస్తారు కానీ జ్యోతి సురభిలా చేయడం కష్టమంటారు ఆమె గురించి తెలిసినవాళ్లు. జీటీవీలో ప్రసారమవుతోన్న ‘కుబూల్ హై’ సీరియల్‌లో లీడ్ రోల్ చేస్తోన్న జ్యోతి... ఈ మధ్య తన టీమ్‌కి పెద్ద షాకిచ్చిందామె.  ‘కుబూల్ హై’ షూటింగ్ జరుగుతోంది. పగిలిన సీసాతో జ్యోతి తన చేతి నరాన్ని కోసుకునే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఆమె రెండుమూడుసార్లు సీన్ చేసినా దర్శకుడు తృప్తిపడలేదు. ఇంకాస్త సహజంగా చేయమని కోరాడు. దాంతో జ్యోతి సన్నివేశంలో పూర్తిగా లీనమైపోయింది. తన చేతిని నిజంగానే కోసేసుకుంది. చర్మం చీరుకుపోయి, రక్తం కారిపోతుంటే సెట్‌లోని వారంతా అవాక్కైపోయారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదృష్టంకొద్దీ గాయం లోతుగా అవ్వలేదు. ఎందుకిలా చేశావ్ జ్యోతీ అని అడిగితే... ‘నటన ఎప్పుడూ అసహజంగానే అనిపిస్తుంది, సహజత్వం రావాలంటే కాస్త జీవించాలి కదా’ అంది నవ్వేస్తూ. ఆమె కమిట్‌మెంట్‌కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదట ఆ దర్శకుడికి. మరీ ఇంతగా జీవించాల్సిన అవసరం లేదులేమ్మా అన్నాడట ఎలా స్పందించాలో తెలీక!

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement