 
															గడుగ్గాయి
చీమలను చూసి ఏం నేర్చుకోవాలి రా? తీపి తినడం, దాచుకోవడం
	టీచర్: చీమలను చూసి ఏం నేర్చుకోవాలి రా?
	చింటు: తీపి తినడం, దాచుకోవడం
	 
	 త్యాగం
	 నరేష్: ఒరే సోము, నీ బైకు ఎవరో ఎత్తుకెళ్లారంట... కంప్లయింట్ ఇవ్వలేదా?
	 సోము: ఎలా వచ్చింది అలా పోతుంది. దానికెందుకురా కంప్లయింట్!
	 
	 చాలా బాగుంది
	 లేడీ డాక్టర్: గట్టిగా మూడు సార్లు గాలిపీల్చి వదలండి.
	 శంకర్రావు: వదిలానండి.
	 లేడీ డాక్టర్: ఇపుడేమనిపిస్తోంది?
	 శంకర్రావు: మీ సెంటు చాలా బాగుందనిపిస్తోందండీ
	 
	 భర్తకు వైద్యం
	 భార్య: డాక్టరు గారూ, మా వారిని కొంచెం పరీక్షించండి
	 డాక్టరు: ఏమైంది?
	 భార్య: రాత్రిపూట నిద్రలో ఒకటే మాట్లాడుతున్నారు.
	 డాక్టరు: దానికి చికిత్స ఎందుకమ్మా, పగటి పూట నువ్వు ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తే చాలు.
	 
	 పంచ్!
	 నాగరాజు: పొద్దున ఒక యజమాని గాడిదను కొడుతుంటే ఆపా, దీన్నేమంటారో తెలుసా?
	 గంగరాజు: సోదర ప్రేమ !!
	 
	 పెళ్లి మానే అవకాశం
	 భక్తుడు: గురువు గారూ, నాకో ధర్మ సందేహం ఉంది.
	 గురువు: అడుగు నాయనా?
	 భక్తుడు: మనిషికి భవిష్యత్తు తెలిసిపోయే శక్తి వస్తే ఏం జరుగుతుంది?
	 గురువు: ఇక పెళ్లిళ్లు జరగవు నాయనా, ఆశ్రమాలు కిటకిటలాడుతాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
