ఈ టైమ్‌లో  అవన్నీ  చేయవచ్చా?

Funday health councling - Sakshi

సందేహం

∙నా వయసు 22 సంవత్సరాలు. నేను ఈమధ్య కాస్త  బరువు పెరిగాను. గడ్డం దగ్గర మొటిమలు వస్తున్నాయి. అవాంఛిత రోమాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీని గురించి నా స్నేహితురాలికి చెబితే ‘పీసీఓయస్‌ కావచ్చు’ అంటోంది. ఇది నిజమేనా? ఈ డిజార్డర్‌ గురించి, నివారణ చర్యల గురించి వివరంగా తెలియజేయగలరు. – యంఎన్, కొవ్వూరు
పీసిఓయస్‌ అంటే Polycystic ovary syndrome (pcos)  అందులో గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాల్లో చిన్న చిన్న ఫాలికల్స్‌ ఎక్కువగా ఉండి, నీటి బుడగలులాగా ఉంటాయి. ఇవి కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల, అధికబరువు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలతో పాటు ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడతాయి. మగవారిలో ఎక్కువగా ఉండే ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ pఛిౌటఉన్నవాళ్లలో ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల బరువు పెరగటం, అవాంఛిత రోమాలు, జుట్టు ఊడటం, మొటిమలు రావటం, పీరియడ్స్‌ క్రమం తప్పటం, గర్భం దాల్చడానికి ఇబ్బంది వంటి ఎన్నో లక్షణాలు బయటపడతాయి. చిన్న సమస్యగానే భావించి నిర్లక్ష్యం చేస్తే.. చిన్నవయసులోనే బీపి, షుగర్, గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి pఛిౌటస్కానింగ్‌ ద్వారా మరియు కొన్ని రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఇవి ఎవరికి, ఎందుకు వస్తాయి అని చెప్పలేం. జన్యుపరమైన కారణాల వల్ల, కొందరు సన్నగా ఉన్నా కూడా pఛిౌటరావచ్చు. ఇవి అనేక కారణాల వల్ల వస్తాయి కాబట్టి.. వీటికి నివారణ చర్యలు చెప్పటం కూడా కష్టం. కాకపోతే ఇవి ఇంకా ఎక్కువ పెరగకుండా లక్షణాల తీవ్రతను అదుపులోకి పెట్టుకోవటానికి బరువు పెరగకుండా వ్యాయామాలు, మితమైన డైటింగ్‌ చెయ్యటం మంచిది. అలాగే వారివారి లక్షణాలను బట్టి డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడవలసి ఉంటుంది. వీరిలో షుగర్‌ ఉన్నవారిలోలాగా ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించడానికి కొందరికి షుగర్‌కి వాడే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది.

నా వయసు 27 సంవత్సరాలు. నేను అధిక బరువు ఉంటాను. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. ఈ టైమ్‌లో డైట్, వ్యాయామాల ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చా? ఒకవేళ చేసే వీలు ఉంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలియజేయగలరు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బరువు తగ్గించుకునే ప్రయత్నాలు మంచిది కాదని మా వారు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? దయచేసి వివరంగా తెలపండి. – కె.నీలిమ, సంగారెడ్డి
అధిక బరువు ఉండటం వల్ల హార్మోన్స్‌లో తేడాలు ఏర్పడి పిరియడ్స్‌లో ఇబ్బందులు, గర్భం దాల్చడానికి ఇబ్బందులు, త్వరగా చిన్నవయసులోనే బీపి, షుగర్, మోకాళ్లనొప్పులు వంటి ఇబ్బందులు వస్తుంటాయి. గర్భం దాల్చిన తర్వాత హార్మోన్‌ అసమతుల్యత వల్ల అబార్షన్లు, బీపి, షుగర్‌ పెరిగే అవకాశాలు, కాన్పు సమయంలో కాన్పు తర్వాత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువ. కాబట్టి బరువు తగ్గి సాధారణ బరువుకి వస్తే పైన చెప్పిన సమస్యల నుంచి బయటపడవచ్చు. బరువు తగ్గడానికి వాకింగ్, యోగా, జాగింగ్‌ వంటి వ్యాయామాలతో పాటు, మితమైన డైటింగ్‌ చెయ్యవచ్చు. ఇవన్నీ గర్భందాల్చక ముందే చెయ్యవలసిన పనులు. గర్భం వచ్చిన తర్వాత ఉన్న అధికబరువును తగ్గించడమనేది ఎంతమాత్రం మంచి పని కాదు. కానీ ఇంకా ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఆహారంలో అన్నం తక్కువ తీసుకుంటూ.. కూరలు ఎక్కువ తినడం, జంక్‌ఫుడ్, నూనె వస్తువులు, వేపుళ్లు, స్వీట్స్, చక్కెర వంటివి వాడకపోవటం, అరటిపండు, సపోటా వంటి చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లను అతి తక్కువగా తీసుకోవటం వంటివి పాటిస్తే ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవచ్చు. అలాగే రోజూ ఉదయం, సాయంకాలం 15 నిమిషాల పాటు సాధారణ వాకింగ్, మీ డాక్టర్‌ సలహా మేరకు అధికశ్రమలేని చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు. చిన్న చిన్న ఇంటి పనులను కూడా చేసుకోవచ్చు.

నేను ప్రెగ్నెంట్‌. నా వయసు 27. నేను ‘మార్నింగ్‌సిక్‌నెస్‌’ కు గురువుతున్నాను. ఏది తింటున్నా వికారంగానే అనిపిస్తోంది. దీని గురించి డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? ‘మార్నింగ్‌సిక్‌నెస్‌’ పోవడానికి హోమ్‌రెమిడీల గురించి వివరంగా తెలియజేయగలరు. – జి.భార్గవి, నందిగామ
ప్రెగ్నెన్సీ మొదలయిన మొదటి మూడు నెలల్లో, ఎదిగే పిండం దగ్గర నుంచి బీటా హెచ్‌సిజి (ఏఇఎ) అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. ఇది కొంతమందిలో కొద్దిగా, మరికొందరిలో ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల ఒక్కొక్కరిలో వికారం, వాంతులు, ఆకలిలేకపోవడం, నీరసం బద్ధకం, ఓపిక లేకపోవడం, నిద్ర ఎక్కువగా ఉండటం, లేదా నిద్రపట్టకపోవడం, కొన్ని రకాల ఆహారపు పదార్థాలు నచ్చకపోవడం, ఎసిడిటీ వంటి ఇబ్బందులు ఉంటాయి. వీటినే మార్నింగ్‌ సిక్‌నెస్‌ అంటారు. ఏఇఎ మోతాదుని బట్టి.. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి.. మార్నింగ్‌ సిక్‌నెస్‌ లక్షణాలు ఉంటాయి. ఇవి మెల్లగా మూడు నెలలు దాటిన తర్వాత చాలావరకు తగ్గిపోతాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. తినే ఆహారంలో నూనె వస్తువులు, వేపుళ్లు, పచ్చళ్లు, కారం, మసాలాలు, కాఫీ, టీ వంటివి తీసుకోకపోవటమే అన్ని విధాల మంచిది. లేదా ఎంత తక్కువ తీసుకుంటే అంతమంచిది.  కొబ్బరి నీళ్లు, మజ్జిగ, మంచినీళ్లు, రాగిజావ, పండ్లు, పండ్లరసాలు, పాలు వంటివి ఎక్కువసార్లు తీసుకోవచ్చు. లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్‌ సలహా మేరకు.. ఛీ్ఠౌజీn్చ్ట్ఛ, ట్చnజ్టీజీఛీజీn్ఛ వంటి మాత్రలు, వాంతులు బాగా ఎక్కువగా ఉంటే ౌnఛ్చీnట్ఛ్టటౌn మాత్రలు వాడుకోవచ్చు. అంతేకానీ వికారం, వాంతులు అవుతున్నాయని, తినాలని అనిపించడంలేదని తినకుండా ఉండకూడదు. దీని వల్ల ఇంకా గ్యాస్‌ ఎక్కువగా ఏర్పడి.. లక్షణాల తీవ్రత పెరిగి.. సమస్య మరింత పెద్దదిగా మారవచ్చు. అందుకే వాంతులు అవుతున్నా, ఏదోఒకటి, కొద్దికొద్దిగా తాగుతూ, తింటూ ఉండాలి. మార్నింగ్‌సిక్‌నెస్‌ లక్షణాలు పెరుగుతూ బాగా ఇబ్బందిగా మారి కళ్లు తిరగడం, బీపీ తగ్గిపోవడం వంటివి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి డాక్టర్‌ దగ్గరకు వెళ్లకపోతే.. డీహైడ్రేషన్‌లోకి వెళ్లి, ప్రాణాపాయస్థితికి చేరుకునే అవకాశాలూ లేకపోలేదు. ఇంటి చిట్కాలు, డాక్టర్‌ సలహాలు, మందులు పనిచెయ్యకపోతే.. తప్పనిసరిగా ఆసుపత్రిలో అడ్మిట్‌ అయ్యి, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని సెలైన్స్‌ పెట్టించుకోవలసి ఉంటుంది. అంతేకానీ నిర్లక్ష్యం ఎంతమాత్రం మంచిది కాదు.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌హైదరాబాద్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top