తళుక్కున మెరిసేందుకు

Funday beauty tips nov 11 2018 - Sakshi

న్యూ ఫేస్‌

క్రీమ్స్, లోషన్స్‌ రాసుకోవడం వల్ల వచ్చే అందంకంటే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ల వల్ల నిలిచే అందానికే ఓటేస్తుంటారు చాలామంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఇంటిపట్టున దొరికే... వాటితోనే ఫేస్‌ప్యాక్‌లు సిద్ధం చేసుకోవచ్చు. అయితే ఫేస్‌ప్యాక్‌కు ముందు క్లీనప్, స్క్రబ్‌ వంటివి తప్పని సరిగా చేసుకుంటే చర్మంపైన పేరుకుపోయిన మృతకణాలు పూర్తిగా తొలిగిపోయి మృదువుగా, మచ్చలు, మొటిమలు వంటివి లేకుండా అందంగా తయారవుతుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి.

కావల్సినవి :
క్లీనప్‌ : పెరుగు – పావు టీ స్పూన్, ఆరెంజ్‌ జ్యూస్‌ – 1 టీ స్పూన్‌
స్క్రబ్‌ : ఆరెంజ్‌ తొక్కల పొడి – 2 టీ స్పూన్లు, అరటి పండు గుజ్జు – 2 టీ స్పూన్లు,  చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు
మాస్క్‌ : కిస్మిస్‌ గుజ్జు – అర టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు, కొబ్బరిపాలు – 2 టీ స్పూన్లు
తయారీ: ముందుగా పెరుగు, ఆరెంజ్‌ జ్యూస్‌ ఒక బౌల్‌లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్‌ తొక్కల పొడి, అరటి పండు గుజ్జు, చిక్కటిపాలు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్‌ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు శనగపిండి, కొబ్బరిపాలు, కిస్మిస్‌ గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్‌ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top