వాటితో డయాబెటిస్‌ ముప్పు

Scientists discover artificial sweeteners may up diabetes risk - Sakshi

లండన్‌ : శీతల పానీయాలు, డైట్‌ డ్రింక్స్‌, రెడీ మీల్స్‌, సూప్స్‌ చివరికి కెచప్‌ వంటి పదార్థాలను తీసుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాలని తాజా అథ్యయనం హెచ్చరిస్తోంది. డ్రింక్స్‌లో వాడే స్వీటెనర్లతో టైప్‌ టూ డయాబెటిస్‌ ముప్పు పొంచిఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీటిని అతిగా సేవిస్తే శరీరం చక్కెరను హ్యాండిల్‌ చేయడంలో మార్పులు సంభవించి డయాబెటిస్‌ ముప్పుకు లోనయ్యే ప్రమాదం ఉందని అథ్యయనం పేర్కొంది.

రెండు వారాల పాటు ఎక్కువ మోతాదులో కృత్రిమ స్వీటెనర్లను తీసుకోవడం రోజుకు ఐదు క్యాన్ల డైట్‌ డ్రింక్‌ తాగడంతో సమానమని శాస్త్రవేత్తలు నిగ్గుతేల్చారు. ఇలా తీసుకుంటే శరీరం గ్లూకోజ్‌ను స్వీకరించే సామర్థ్యం కోల్పోతుందని వారు హెచ్చరించారు. క్రమంగా ఇది టైప్‌ టూ డయాబెటిస్‌ చుట్టుముట్టేందుకు దారితీస్తుందని స్పష్టం చేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ అడిలైడ్‌కు చెందిన ప్రొఫెసర్‌ రిచర్డ్‌ యంగ్‌ నేతృత్వంలోని ఆస్ర్టేలియన్‌ పరిశోధకుల బృందం 27 మంది ఆరోగ్యవంతమైన వాలంటీర్లపై జరిపిన అథ్యయనంలో ఈ అంశాలు వెలుగుచూశాయి. 

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top