ఉచిత మానసిక ఆరోగ్య శిక్షణ | Free training programs in Mind and Personality Care | Sakshi
Sakshi News home page

ఉచిత మానసిక ఆరోగ్య శిక్షణ

Oct 3 2014 3:15 AM | Updated on Sep 2 2017 2:17 PM

ఉచిత మానసిక ఆరోగ్య శిక్షణ

ఉచిత మానసిక ఆరోగ్య శిక్షణ

ప్రపంచ ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో శనివారం నుంచి ఈ నెల 10 వరకు జరగనున్నాయి.

ప్రపంచ ఆరోగ్య వారోత్సవాల సందర్భంగా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలు చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో శనివారం నుంచి ఈ నెల 10 వరకు జరగనున్నాయి. తొలిరోజు ప్రారంభ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ కమిషనర్ పి.విజయబాబు అధ్యక్షత వహించనుండగా, ముషీరాబాద్ ఎమ్మెల్యే, తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నాయుకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు.
 
  ప్రతిరోజూ సాయుంత్రం 5.30 నుంచి రాత్రి 9.00 గంటల వరకు జరగనున్న కార్యక్రమాల వివరాలు... 4వ తేదీన‘మానసిక ఆరోగ్యం-కుటుంబ సంక్షేమం’పై డాక్టర్ కె.నిరంజన్ రెడ్డి, 5న ‘మంచి తల్లిదండ్రులుగా పిల్లలను తీర్చిదిద్దుకోవడం ఎలా’ అనే అంశంపై వి.వేణుభగవాన్, 6న ‘మీ చుట్టూ ఉన్నవారితో విజయవంతంగా ఉండటం ఎలా?’ అనే అంశంపై బి.ఉమామహేశ్వరరావు, 7న ‘జ్ఞాపకశక్తిని పెంపొందించుకోవడం ఎలా?’ అనే అంశంపై డాక్టర్ బి.సాయికిరణ్, 8న ‘మానసిక ఒత్తిడిని జయించడం ఎలా?’ అనే అంశంపై శ్రుతికీర్తి రవికాంత్, 9న ‘చిత్రాలతో జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎలా?’ అనే అంశంపై వై.సురేష్‌బాబు శిక్షణ ఇవ్వనున్నారు. వారోత్సవాల ముగింపు సందర్భంగా 10న హిప్నో కమలాకర్, హిప్నో పద్మాకమలాకర్ ‘స్టేజ్ హిప్నాటిజం’ ప్రదర్శన ఇవ్వనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement