కొప్పున చందమామ

womens hair pins special - Sakshi

ఈ కాలం భుజాల మీదుగా వెంట్రుకలు పడితే ఉక్కపోత కారణంగా చిరాకుగా అనిపిస్తుంటుంది. అందుకే చాలా వరకు కేశాలను కొప్పులా ముడేయడానికి ఇష్టపడతారు మగువలు. మరి ఆ కొప్పు ఎలాంటి అలంకరణ లేకుండా ఉంటే వేడుకలో డల్‌ అవుతారు.  సింపుల్‌ అనిపిస్తూనే చూపరులను ఇట్టే ఆకట్టుకునేలా కొప్పుకు నాజూకైన అలంకరణలు ఎన్నో వచ్చాయి. వాటిలో మీరు మెచ్చే కొప్పుల ఆభరణాలు ఇవి.
పూల మొగ్గలు/ఆర్టిఫిషియల్‌ గజ్రా... కొప్పున మల్లె మొగ్గలను సింగారించడానికి ఇప్పుడు చాలా భిన్నమైన, సులువైన పద్ధతులున్నాయి. హెయిర్‌ పిన్‌కి మల్లెలు చుట్టి వాటిని కొప్పులో క్రాస్‌గా గుచ్చితే చాలు. ప్లాస్టిక్‌ పువ్వుల కొప్పు దండ(గజ్రా)లూ ఉన్నాయి.

హెయిర్‌ పిన్‌... కొప్పులో సింగారించడానికి దువ్వెన పళ్ల మాదిరి ఉండే క్లిప్స్‌ మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని కొప్పుకు ఓ వైపుగా లోపలికి గుచ్చితే చాలు. బయటకు కనిపించే పిన్‌ డిజైన్‌ ఇట్టే ఆకట్టుకుంటుంది.
హెయిర్‌ బ్రూచ్‌... పమిటకు సింగారించే బ్రూచ్‌ స్టైల్‌ కేశాలంకరణకూ వచ్చాయి. ఇది ఒక పువ్వులా ఉండి కొప్పు మధ్యన చందమామలా మెరిసిపోతుంటుంది.హెయిర్‌ స్టిక్‌ /బాబ్‌ పిన్స్‌... ముడి వేశాక కురులు విడకుండా ఉండటానికి స్టిక్స్‌ అవసరం పడుతుంటాయి. వీటికీ డిజైనర్‌ టచ్‌ ఉండటంతో కేశాలంకరణలో ముదువరసలో ఉన్నాయి.  హెడ్‌ పీస్‌... తల మీదుగానే కాదు కొప్పును కింద నుంచి అలంకరించే ఆధునికపు కేశాలంకరణ క్లిప్స్‌ వచ్చాయి. ఇవి వెస్ట్రన్‌ స్టైల్‌ కేశాలంకరణకు మరింత వన్నె తెస్తాయి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top