breaking news
hair pins
-
కొప్పున చందమామ
ఈ కాలం భుజాల మీదుగా వెంట్రుకలు పడితే ఉక్కపోత కారణంగా చిరాకుగా అనిపిస్తుంటుంది. అందుకే చాలా వరకు కేశాలను కొప్పులా ముడేయడానికి ఇష్టపడతారు మగువలు. మరి ఆ కొప్పు ఎలాంటి అలంకరణ లేకుండా ఉంటే వేడుకలో డల్ అవుతారు. సింపుల్ అనిపిస్తూనే చూపరులను ఇట్టే ఆకట్టుకునేలా కొప్పుకు నాజూకైన అలంకరణలు ఎన్నో వచ్చాయి. వాటిలో మీరు మెచ్చే కొప్పుల ఆభరణాలు ఇవి. పూల మొగ్గలు/ఆర్టిఫిషియల్ గజ్రా... కొప్పున మల్లె మొగ్గలను సింగారించడానికి ఇప్పుడు చాలా భిన్నమైన, సులువైన పద్ధతులున్నాయి. హెయిర్ పిన్‌కి మల్లెలు చుట్టి వాటిని కొప్పులో క్రాస్‌గా గుచ్చితే చాలు. ప్లాస్టిక్ పువ్వుల కొప్పు దండ(గజ్రా)లూ ఉన్నాయి. హెయిర్ పిన్... కొప్పులో సింగారించడానికి దువ్వెన పళ్ల మాదిరి ఉండే క్లిప్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని కొప్పుకు ఓ వైపుగా లోపలికి గుచ్చితే చాలు. బయటకు కనిపించే పిన్ డిజైన్ ఇట్టే ఆకట్టుకుంటుంది. హెయిర్ బ్రూచ్... పమిటకు సింగారించే బ్రూచ్ స్టైల్ కేశాలంకరణకూ వచ్చాయి. ఇది ఒక పువ్వులా ఉండి కొప్పు మధ్యన చందమామలా మెరిసిపోతుంటుంది.హెయిర్ స్టిక్ /బాబ్ పిన్స్... ముడి వేశాక కురులు విడకుండా ఉండటానికి స్టిక్స్ అవసరం పడుతుంటాయి. వీటికీ డిజైనర్ టచ్ ఉండటంతో కేశాలంకరణలో ముదువరసలో ఉన్నాయి. హెడ్ పీస్... తల మీదుగానే కాదు కొప్పును కింద నుంచి అలంకరించే ఆధునికపు కేశాలంకరణ క్లిప్స్ వచ్చాయి. ఇవి వెస్ట్రన్ స్టైల్ కేశాలంకరణకు మరింత వన్నె తెస్తాయి. -
వెంట్రుకలు చిట్లుతున్నాయి..
నా జుట్టు బాగా పొడిబారి, వెంట్రుక మధ్య నుంచి చిట్లుతోంది. వెంట్రుకల చివర్లు బాగా దెబ్బతిన్నాయి. ఇంట్లోనే చేసుకోదగిన చిట్కాలు చెప్పండి. - క్షేత్ర, ఇ-మెయిల్ శిరోజాలకు తగినంత ప్రొటీన్ అందనప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముందుగా ప్రొటీన్లు ఉన్న ఆహారంపై దృష్టిపెట్టండి. కోడిగుడ్డు, బాదంపప్పు ... వంటివి రోజూ తగు మోతాదులో తీసుకోండి. జుట్టు బాగా పొడిబారడం వల్ల చిట్లుతోందని గ్రహించండి. చిట్లిన వెంట్రుకలను కత్తిరించక అలాగే వదిలేయడం వల్ల చివర్లు పెరిగి, వెంట్రుక మధ్యలోకి విరిగినట్టుగా కనిపిస్తోంది. మీరు తల దువ్వుకోవడానికి కలపతో తయారుచేసిన వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనను వాడండి. మాడు నుంచి, కింది వరకు జుట్టులో చిక్కులు లేకుండా దువ్వండి. దీని వల్ల మాడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. లోహంతో తయారైన హెయిర్ పిన్స్‌ను ఉపయోగించకుండా వెడల్పాటి రబ్బర్ బ్యాండ్స్ వాడండి. మాడుకు కాకుండా వారానికి ఒకసారి పెరుగుతో జుట్టుకు ప్యాక్ వేసి, వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. ఈ జాగ్రత్తలు మీ శిరోజాలను ఆరోగ్యవంతంగా మారుస్తాయి. నాకు ముక్కుపైన మాత్రమే మొటిమలు ఎక్కువ అవుతున్నాయి. దీని వల్ల ముక్కు ఎర్రగా కనిపిస్తుంటుంది. మొటిమల లోపల పస్ కూడా ఉంటుంది. మచ్చలు కూడా ఉన్నాయి. - వి.సౌమ్య, విశాఖపట్నం మీకు ముక్కు మీద నూనె గ్రంథులు ఎక్కువ స్రవిస్తున్నాయి. శుభ్రపరుచుకోకపోవడం వల్ల మొటిమల సమస్య పెరుగుతోంది. మొటిమల్లోని పస్ తీయకండి. అలా చేస్తే మచ్చలు ఏర్పడతాయి. మార్కెట్లో డెర్మలాజికల్ స్పా రెమెడీ క్రీమ్ దొరుకుతుంది. ఈ క్రీమ్‌ను రోజుకు రెండుసార్లు రాయండి.