ఆ నూనెలు గుండెకు ఎందుకు మేలు చేస్తాయంటే..

Why are those oils good for the heart? - Sakshi

పరి పరిశోధన

ఈ రోజుల్లో ఎక్కడ చూసిన గుండె జబ్బులకు సంబంధించిన వార్తలే. కారణాలేవైనా కావచ్చుగానీ.. అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే నూనెలు వాడటం, బాగా నిద్రపోవడం అనే రెండు చర్యలతో గుండెజబ్బులతో పాటు గుండెపోటు సమస్యలను గణనీయంగా తగ్గించవచ్చు అంటున్నారు కీనన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ బయో మెడికల్‌ శాస్త్రవేత్తలు. అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండే నూనెలు (కుసుమ, సోయా, సూర్యకాంతి, ఆలివ్‌) ఉన్న ఆహారం జీర్ణమైన తరువాత మన శరీరంలో అపోలిపో ప్రొటీన్‌ (అపో ఏ –4) మోతాదు ఎక్కువ అవుతుందని, రక్తంలో ఈ ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువని ఇప్పటికే పరిశోధనల్లో రుజువైందని డాక్టర్‌ హూ నీ అనే శాస్త్రవేత్త తెలిపారు.

అంతేకాకుండా ఈ అపోలిపో ప్రొటీన్‌ ఇతర వ్యాధుల విషయంలోను మేలు చేస్తుంది. రక్తంలోని ప్లేట్‌లెట్లపై ఉండే గ్లైకో ప్రొటీన్‌ను అడ్డుకోవడం ద్వారా ఇది అవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చూస్తాయని, ఫలితంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడవని వివరించారు. అంతే కాకుండా అపో ఏ –4 ప్రొటీన్‌ రక్తనాళాల్లో గార పేరుకు పోవడాన్ని తగ్గిస్తుందని, ఈ నూనెలతో కూడిన ఆహారాన్ని తీసుకున్న వెంటనే పనిచేయడం మొదలుపెట్టి ప్లేట్‌లెట్ల చురుకుదనాన్ని, ఒకదానితో ఒకటి అతుక్కుపోవడాన్ని తగ్గిస్తుందని వివరించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top