ఈ వారం యూటూబ్ హిట్స్ | This week Youtube hits... | Sakshi
Sakshi News home page

ఈ వారం యూటూబ్ హిట్స్

May 16 2016 2:17 AM | Updated on Sep 4 2017 12:10 AM

ఈ వారం యూటూబ్ హిట్స్

ఈ వారం యూటూబ్ హిట్స్

టాన్ న్యూయన్ పేరుతో యూట్యూబ్‌లోకి మూడు రోజుల క్రితమే విడుదలైన ఈ వీడియోను సున్నిత మనస్కులు చూడకపోవడమే

ఇన్‌క్రెడిబుల్ టైమ్ లాప్స్ ఆఫ్ బర్డ్స్ నెస్ట్
టాన్ న్యూయన్ పేరుతో యూట్యూబ్‌లోకి మూడు రోజుల క్రితమే విడుదలైన ఈ వీడియోను సున్నిత మనస్కులు చూడకపోవడమే మంచిది. అయితే విధి చేసే వింతలు చూడాలన్న ఆసక్తి ఉన్నవారు దీనిని ఏమాత్రం మిస్ చేసుకోకూడదు. ఒక మహావృక్షం. అందులో చిన్న పక్షి గూడు. ఆ గూడులో నాలుగు గుడ్లు. వాటిని పొదిగేందుకు వచ్చి వెళుతున్న పక్షి. ఆ పక్షితో పాటు రోజూ ఆ గుడ్లు పొదిగాయా లేదా అని తన ‘గోప్రో’ కెమెరాతో మాటు వేసి ఉన్న టాన్ న్యూయన్ అనే నెటిజన్. ఇదీ సీన్. ఓ రోజు ఆ పక్షి అప్పటి వరకు గుడ్లు పొదిగి ఎక్కడికో వెళ్లింది. అది అలా వెళ్లగానే టాన్ ఇలా పక్షి గూడుకు గురిపెట్టి తన వీడియో కెమెరాను జూమ్ చేశాడు. అందులోంచి ఓ దృశ్యం చూసి అదిరిపోయాడు. ఏమిటా దృశ్యం? గుండె చిక్కబట్టుకుని చూడండి.
 
మదారి :
అఫీషియల్ ట్రయల్
జూన్ 10న విడుదలకు సిద్ధమైన ‘మదారి’ చిత్రం ట్రైలర్‌ను టీ సీరీస్ రిలీజ్ చేసింది. ఇర్ఫాన్ ఖాన్, జిమ్మీ షేర్గిల్, తుషార్ డాల్వి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిషికాంత్ కామత్ డెరైక్షన్‌లో తయారైన ఈ సోషల్ థ్రిల్లర్... ‘బజరంగీ భాయ్‌జాన్’లా ప్రేక్షకాదరణ పొందే అవకాశాలున్నాయని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. 2012లో నిర్మాణంలో ఉన్న ముంబై మెట్రో బ్రిడ్జి కూలిపోయిన ఘటన ఆధారంగా దర్శక, నిర్మాతలు కథను అల్లుకున్నారు. చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఇర్ఫాన్ ఖాన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. న్యూఢిల్లీ, రాజస్థాన్, డెహ్రాడూన్, షిమ్లా, ముంబైలలో చిత్ర నిర్మాణం జరిగింది. ఇర్ఫాన్ ఇందులో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే సామాన్యుడిలా కనిపిస్తాడని తప్ప అసలు కథ బయటికి రాలేదు.
 
మెగాన్ ట్రైనర్ - మీ టూ
ఈ వారం యూట్యూబ్ హిట్స్‌లోని పక్షిగుడ్ల వీడియోను వీక్షించి నిర్వేదంలోకి వెళ్లినవారు.. ఈ వీడియోను చూసి రిఫ్రెష్ అవొచ్చు. 22 ఏళ్ల అమెరికన్ గాయని మెగాన్ ఎలిజబెత్ ట్రైనర్ సొగసుగా అడుగులు వేస్తూ లయబద్ధంగా ఆలపించిన ‘మీ టూ’ సాంగ్ మిమ్మల్ని ఉల్లాసవంతమైన ఉషోదయం నుంచి ఆహ్లాదకరమైన సాయంత్రాల వరకు నడిపించుకుంటూ వెళుతుంది. ‘ఐ థాంక్ గాడ్ ఎవ్రీ డే.. దట్ ఐ వోకప్ ఫీలింగ్ దిస్ వే’ అంటూ మెగాన్ దంతధావనాన్ని ప్రారంభించి, ‘ఇఫ్ ఐ వాజ్ యు, ఐ వుడ్ వాన్నా బి మి టూ’ అనే చరణంతో నైట్ క్లబ్‌లో తేలుతుంది. మధ్యలో ఒకసారి మన ఉషా ఉతుప్‌లా నవ్వుతుంది. ఓపమ్ గంగ్నమ్ స్టెయిల్‌ను గుర్తుకు తెచ్చే స్టెప్పులూ వేస్తుంది.
 
జేసన్ డిరులో - ‘ఇఫ్ ఇట్ ఎయిన్ట్ లవ్’
‘ఇది ప్రేమ కాకపోతే, ఎందుకింత బాగుంది?’ స్ట్రెయిట్ క్వొశ్చన్! అమెరికన్ గాయకుడు, గేయ రచయిత జేసన్ డెరులో అడుగుతున్నాడు చెప్పండి. ప్రేమ ఎందుకంత బాగుంటుంది? డిస్కోగ్రఫీలో జగద్విఖ్యాతుడైన జేసన్ తాజా మ్యూజిక్ ఆల్బమ్ ‘ఇఫ్ ఇట్ ఎయిన్ట్ లవ్’. ఆఫీస్ వర్క్‌ప్లేస్‌లో ఈ పాట మొదలవుతుంది. కంప్యూటర్ ముందు కూర్చోని, అదే గదిలో ఇంకో టేబుల్ మీద సిస్టమ్‌తో పనిచేసుకుంటున్న అమ్మాయి ప్రేమలో పడతాడు జేసన్. పడి, ఆమెను కూడా పడేసేందుకు పాట మొదలు పెడతాడు. దాంతో పాటు డాన్స్. అ అమ్మాయి నవ్వుతుంది. ఆమె ఆఫీస్‌కి వచ్చేటప్పుడు, ఆమె ఆఫీస్ నుంచి వెళ్లేటప్పుడు తనకు ఎలాగుంటోందో చెబుతాడు. ‘ఆన్ ది టిప్ ఆఫ్ మై టంగ్.. ది ఫ్లేవర్ ఆఫ్ యువర్ స్కిన్ లింగర్స్ ఆన్ మై లిప్స్’ అంటూ.. తలకిందులైపోతాడు. యూత్‌కి నచ్చే వీడియో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement