భేషియల్! | The new concept Beach Craze in Ireland | Sakshi
Sakshi News home page

భేషియల్!

Jan 5 2015 10:56 PM | Updated on Oct 17 2018 4:36 PM

భేషియల్! - Sakshi

భేషియల్!

‘‘ముఖారవిందము సరే... ముఖ్యమైన భాగము మరిచారే’’ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో బీచ్‌భామల్ని ఆకట్టుకుంటున్నారు న్యూయార్క్‌లోని ఓ పార్లర్ నిర్వాహకులు.

‘‘ముఖారవిందము సరే... ముఖ్యమైన భాగము మరిచారే’’ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో బీచ్‌భామల్ని ఆకట్టుకుంటున్నారు న్యూయార్క్‌లోని ఓ పార్లర్ నిర్వాహకులు. సముద్రపు ఒడ్డున స్విమ్‌సూట్స్‌లో సంచరించే అమ్మాయిలు బీచ్ డ్రెస్సులు వేసుకున్నప్పుడు దాదాపు ఆచ్ఛాదన లేకుండా కనపడే ‘బమ్స్’ పార్ట్‌ను మెరిపించడానికి డాక్టర్ మాధ్యూ ష్యూల్మన్ అనే ప్లాస్టిక్ సర్జన్  ఓ పరిష్కారాన్ని కనిపెట్టాడు. అదే బట్ ఫేషియల్.

ఆత్మవిశ్వాసంతో బీచ్‌లో సంచరించాలంటే  మా ఫేషియల్ మీకు అండా దండా అని ప్రచారం కూడా మొదలుపెట్టాడు. అలా అలా ఇప్పుడు బీచ్ సర్కిల్‌లో ఇదో హాట్ ట్రీట్‌మెంట్‌గా మారింది.  డెడ్ స్కిన్‌ను తొలగించడంతో మొదలై రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్‌మెంట్ , స్మూతెనింగ్ వగైరాలతో ఉండే ఈ బమ్ మేకోవర్ చేయించుకోవాలంటే 500 డాలర్లు ముట్ట జెప్పాల్సిందే. అయితేనేం... మేకోవర్ ప్లీజ్ అంటూ బీచ్ క్వీన్స్ పార్లర్ దగ్గర క్యూ కట్టేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement