గంధపు చెక్క... పన్నీటి చుక్క

sandalwood works well to remove the dirt on the face - Sakshi

బ్యూటిప్స్‌

ఎండలో తిరగడం వల్ల కాంతిహీనంగా తయారైన ముఖానికి ఎన్ని క్రీములు వాడినా ఒక్కోసారి ఏమంత ప్రయోజనం ఉండదు. అలాంటప్పుడు ప్రకృతి సహజంగా లభించే మూలికలను ఒకసారి ప్రయత్నం చేసి చూస్తే సరి. ఇందుకు గంధం చాలా బాగా పని చేస్తుంది. ఎందుకంటే గంధంలో మేని ఛాయను మెరుగుపరచడం, మొటిమల్ని అదుపులో ఉంచడం, సుగంధ పరిమళాలు వెదజల్లడం వంటి చర్మానికి మేలు చేసే సుగుణాలెన్నో ఉన్నాయి. ఇంతకీ గంధాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దామా మరి!

►పాలతో గంధం చెక్కని అరగదీసి దానికి కాస్త పంచదార కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి బాగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోయి కాంతివంతంగా కనిపిస్తుంది.

►పావుకప్పు గంధం పొడి, పావుకప్పు రోజ్‌ వాటర్, అరచెక్క నిమ్మరసం కలిపి ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరువాత ముఖాన్ని చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా కనీసం రెండుసార్లయినా చేస్తుంటే ముఖం మిలమిలలాడుతుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top