అంత బాగా చేశానా! | Gully Boy Wins Best Feature Film Award At Asian Academy Creative Award | Sakshi
Sakshi News home page

అంత బాగా చేశానా!

Jan 23 2020 1:19 AM | Updated on Jan 23 2020 1:19 AM

Gully Boy Wins Best Feature Film Award At Asian Academy Creative Award - Sakshi

‘గల్లీ బాయ్‌’ సినిమా విడుదలై ఏడాది అవుతోంది. 40 కోట్లు పెట్టి తీస్తే, 240 కోట్లు వచ్చాయి! అందులో అలియా భట్‌ నటన కోట్ల రూపాయల్ని మించిపోయింది. ఏడాదిగా అందరూ అలియాను ప్రశంసిస్తున్నవారే. ఆస్కార్‌ అవార్డుల నామినేషన్‌కు ఎంపికై, నామినేషన్‌ను దక్కించుకోక పోయినప్పటికీ.. ‘‘గల్లీ బాయ్‌ అలియాకు ఆస్కార్‌ లాంటిదే’ అని అలియాకు అభిమానులు అయినవారు, కానివారు కూడా అంటుంటే అలియా ఆ ‘భారాన్ని’ మోయలేకపోతున్నారు. ‘‘నిజంగా నేను అంత బాగా చేశానా అనిపిస్తోంది. ఇంకొక సందేహం కూడా వస్తోంది.

ఈ అభినందనలకు నేను అర్హురాలినేనా అని! నాక్కూడా ఆ సినిమాలో నా పాత్ర నచ్చింది కానీ, ప్రేక్షకులకు మరీ ఇంత బాగా నచ్చడమే నన్ను ఆత్మన్యూనతకు గురి చేస్తోంది’’ అని బుధవారం ముంబై మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు అలియా. అలియా సెల్ఫ్‌ క్రిటిక్‌. స్వీయ విమర్శ చేసుకుంటారు. ఎవరైనా విమర్శించినా సంతోషంగా స్వీకరిస్తారు. గల్లీ బాయ్‌లో అంత బాగా చేశాక కూడా.. ‘డిడ్‌ ఐ వర్క్‌ హార్డ్‌’ అని తనను తను ప్రశ్నించుకుంటున్నారంటే.. ఇప్పుడు ఆమె చేస్తున్న ‘సడక్‌ 2’లో మరింత బాగా నటించబోతున్నారనే అనుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement